Aloo Bonda; బంగాళదుంప అంటే పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో రోడ్ల పక్కన బండ్ల మీద, హోటల్స్ లభించే Aloo Bonda ను అంతే రుచితో మన ఇంటిలోనే చాలా రుచిగా చాలా సులభంగా చేసుకోవచ్చు. Aloo Bonda కి అవసరమైన పదార్ధాలు, తయారి విధానం వివరంగా తెలుసుకుందాం.
కావలసినవి
శనగపిండి 1/2 కప్పు
ఉప్పు సరిపడా
కారం సరిపడా
వాము అరస్పూన్
నూనె డీప్ ఫ్రై కోసం
పిండిని కలపటానికి నీరు
ఫిల్లింగ్ కోసం -
ఉడికించిన బంగాళదుంపలు 2
ఉల్లిపాయ 1 (ముక్కలుగా కట్ చేయాలి )
అల్లం ముక్కలు 1 స్పూన్
పచ్చిమిర్చి ముక్కలు
ఉప్పు సరిపడా
పసుపు పావు స్పూన్
సన్నగా తరిగిన కొత్తిమీర
తాలింపు
నూనె 2 టీస్పూన్లు
ఆవాలు 1/2 టీస్పూన్
శనగ పప్పు 1 టీస్పూన్,
మినపప్పు 1 టీస్పూన్,
జీలకర్ర 1/2 టీస్పూన్,
ఇంగువ చిటికెడు,
కరివేపాకు
తయారి విధానం
ముందుగా ఒక బౌల్ లో శనగపిండి,ఉప్పు,కారం,వాము,సరిపడా నీటిని పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టాలి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి కొంచెం వేడి అయ్యాక ఆవాలు,శనగపప్పు,మినపప్పు,జీలకర్ర,ఇంగువ,కరివేపాకు వేసి వేగించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు,అల్లం ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించాలి.
ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంపను మెత్తగా చేసి వేయాలి. ఆ తర్వాత సరిపడా ఉప్పు,పసుపు వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర వేసి బాగా కలిపి పొయ్యి మీద నుంచి దించి చల్లారనివ్వాలి.
ఈ బంగాళాదుంప మిశ్రమం చల్లారిన తరువాత ఉండలుగా చేసి పెట్టుకోవాలి.
పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె పోసి వేడి అయ్యాక బంగాళాదుంప ఉండలను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మీడియం మంటపై క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.ఈ Aloo Bonda చాలా రుచిగా ఉంటుంది. దీనిలోకి వెల్లుల్లి కారం, గ్రీన్ చట్నీ, టమాట కిచప్ మంచి కాంబినేషన్.