Quinoa Upma: త్వరగా బరువు తగ్గాలని అనుకుంటున్నారా...అయితే క్వినోవా ఉప్మా తినండి


Quinoa Upma:ఈ మధ్య కాలంలో Quinoa వాడకం ఎక్కువ అయింది. Quinoa లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. తెల్ల అన్నంకు బదులు Quinoa తింటే అధిక బరువు నుండి తొందరగా విముక్తి లభిస్తుంది. 

అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. Quinoa Upma కి కావలసిన పదార్ధాలు, తయారి విధానం గురించి వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్ధాలుక్వినోవా - ఒక కప్పు
నూనె - రెండు స్పూన్లు
ఎండు మిర్చి - ఒకటి (ముక్కలుగా కట్ చేయాలి)
జీలకర్ర - అర స్పూను
పెసర పప్పు - ఒక స్పూను
పచ్చి బఠానీలు - పావు కప్పు
నీళ్లు - రెండు కప్పులు
బీన్స్ - పావు కప్పు (ముక్కలుగా కట్ చేయాలి)
క్యాప్సికమ్ - ఒకటి (ముక్కలుగా కట్ చేయాలి)
ఉల్లిపాయ - ఒకటి (ముక్కలుగా కట్ చేయాలి)
క్యారెట్ - ఒకటి (ముక్కలుగా కట్ చేయాలి)
కరివేపాకు - రెండు రెమ్మలు
అల్లం ముక్కలు - ఒక స్పూను
ఆవాలు - ఒక స్పూను
మినపప్పు - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా

తయారి విధానం
క్వినోవాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. పొయ్యి వెలిగించి నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర,ఆవాలు వేసి చిటపడలాడాక పెసరపప్పు, మినపప్పు, అల్లం ముక్కలు, ఎండు మిర్చి ముక్కలు వేసి వేగించాలి.

కాస్త వేగాక ఉల్లిపాయ ముక్కలు,కరివేపాకు వేసి వేగించాలి. ఉల్లిపాయ కాస్త మెత్తగా అయ్యాక క్యారెట్ ముక్కలు, క్సాప్సికమ్ ముక్కలు,బీన్స్ ముక్కలు, పచ్చి బఠానీలు వేసి వేగించాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న క్వినోవా వేయాలి.

రెండు గ్లాసుల నీటిని పోసి మూత పెట్టి సిమ్ లో ఉడికించాలి. నీరు అంతా ఆవిరి అయ్యాక పొడిపొడిగా ఉంటుంది. క్వినోవా బాగా ఉడికితే క్వినోవా ఉప్మా రెడీ. అధిక బరువు, డయాబెటిస్ ఉన్నవారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే మంచిది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top