Momos Side Effects: రోజూ మోమోస్ తింటున్నారా? అయితే ఈ విషయాన్నీ తెలుసుకోండి

Momos Side Effects:ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన ఫుడ్.. మోమోస్. మనలో చాలా మంది స్కూల్, కాలేజ్, ఆఫీసు నుంచి తిరిగొచ్చేటప్పుడు రోడ్డుపక్కన నిలబడి మోమోస్ తింటూ ఉంటారు...లేదంటే ప్యాక్ చేయించుకొని ఇంటికి వచ్చాక తింటూ ఉంటారు.

వర్షాకాలంలో మోమోలు తినడం చాలా రుచిగా ఉంటుంది. దాంతో చాలా మంది మోమోలు తినేందుకు ఇష్ట పడుతున్నారు. అలా తినటం వలన కొన్ని సమస్యలు వస్తాయి. మోమోస్ ని ఇడ్లీల మాదిరిగా ఆవిరిపై ఉడికించి తయారుచేయటం వలన నూనె, మసాలా వంటివి ఉండవని వీటిని తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. 

అయితే వాటిని తయారుచేసే పిండిలోనే సమస్య ఉందని నిపుణులు చెప్పుతున్నారు. మోమోలను మైదా పిండి నుంచి తయారు చేస్తారు. మోమోస్ ఎక్కువ సమయం మెత్తగా ఉండటానికి అలోక్సాన్ అనే లిక్విడ్ కలుపుతారు. ఇది ఆరోగ్యానికి హానికరం. 

రోజు మైదాతో తయారు చేసిన మోమోలను తినడం వలన రక్తంలో చెక్కెర స్థాయిలు పెరుగుతాయి. అంతేకాకుండా మలబద్దకం సమస్య కూడా వస్తుంది. మోమోస్‌లో మోనో-సోడియం గ్లుటామేట్ (MSG) ఎక్కువగా ఉండుట వలన బరువు పెరగటమే కాకుండా నాడీ సంబంధిత సమస్యలు వస్తాయి. 

అయితే మోమోలను బియ్యంపిండితో తయారుచేస్తే తినవచ్చు. కానీ హోటల్స్ మరియు స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు మైదా పిండితోనే చేస్తారు. మైదా ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి రోజు తినకుండా అప్పుడప్పుడు తినండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Click Here To Follow TeluguLifeStyle On Google News
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top