Avocado Rice:Avocado లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకప్పుడు Avocado చాలా తక్కువగా లభించేది. కానీ ఇప్పటి రోజుల్లో చాలా విరివిగా లభ్యం అవుతుంది. Avocado లో ఉన్న ప్రయోజనాల కారణంగా చాలా మంది తినటానికి ప్రయత్నం చేస్తున్నారు. Avocado తో Rice చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. Avocado Rice కి కావలసిన పదార్ధాలు, తయారి విధానం గురించి వివరంగా తెలుసుకుందాం.
కావలసిన పదార్ధాలు
వండిన అన్నం 2 కప్పులు
పసుపు చిటికెడు
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 2 కప్పులు
Avocado గుజ్జు అరకప్పు
వెల్లుల్లి+పచ్చిమిర్చి+కొత్తిమీర పేస్ట్ 2 స్పూన్స్
సరిపడా ఉప్పు
నిమ్మరసం 1 స్పూన్
సన్నగా తరిగిన టమోటా ముక్కలు 2 స్పూన్స్
సన్నగా తరిగిన కాప్సికం ముక్కలు
తురిమిన క్యారెట్
తయారి విధానం
పొయ్యి వెలిగించి నూనె పోసి వేడి అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి+పచ్చిమిర్చి+కొత్తిమీర పేస్ట్,పసుపు, Avocado గుజ్జు, సన్నగా తరిగిన టమోటా ముక్కలు, సన్నగా తరిగిన కాప్సికం ముక్కలు, తురిమిన క్యారెట్, ఉప్పు వేసి వేగించాలి. వేగిన తర్వాత ఉడికించిన అన్నం వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం కలపాలి.