White Spots:తెల్ల మచ్చలు నిమిషాల్లో తగ్గాలంటే ఒక్కసారి ఇలా చేయండి

White spots Home Remedies:ముఖం మీద నల్లమచ్చలు ఎంత అంద వికారంగా కన్పిస్తాయో... తెల్లమచ్చలు కూడా అదే విధంగా కనిపిస్తాయి. కనుముక్కు తీరు ఎంత అందముగా కనిపించినా తెల్లమచ్చలు ఉంటే ఆ ముఖం కళా విహీనంగా కనపడుతుంది. వీటి నివారణకు ఇంటిలో చేసుకొనే కొన్ని చిట్కాలు ఉన్నాయి.

ఇది చాలా పురాతన పద్ధతి. రాత్రి సమయంలో రాగి పాత్రలో నీరు పోసి తెల్లవారి ఆ నీటిని తాగితే ఆరోగ్యంతో పాటు ముఖం మీద తెల్లమచ్చలు పోవటానికి అవకాశం ఉంది.

దానిమ్మ ఆకులను గ్లాస్ నీటిలో వేసి కొన్ని గంటల పాటు నాననివ్వాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి త్రాగితే మంచి పలితం ఉంటుంది.

అల్లం ముక్కను మచ్చలు ఉన్న ప్రదేశంలో సున్నితంగా రుద్దాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే మచ్చలు క్రమేపి తగ్గుతాయి.

మినుములను ఒక రోజంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు వాటిని మెత్తగా రుబ్బి ఆ ముద్దను ఆ మచ్చలపై రాయాలి.

స్నానం చేసే నీటిలో కప్పు రాళ్ల ఉప్పు వేసి కరిగిన తర్వాత స్నానం చేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే తెల్లమచ్చలు క్రమేపి తగ్గిపోతాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా ఈ మచ్చల మీద ప్రభావవంతముగా పనిచేస్తుంది. ఒక కప్పులో ఆపిల్ సైడర్ వెనిగర్ పోసి దానిలో దూదిని ముంచి మచ్చల మీద రాయాలి.

విటమిన్ ఇ ఆయిల్ కూడా మచ్చల మీద సమర్దవంతముగా పనిచేస్తుంది. ఒక కప్పులో విటమిన్ ఇ ఆయిల్ తీసుకోని దానిలో దూదిని ముంచి మచ్చల మీద రాయాలి.

సూర్య కిరణాల వలన కూడా ఈ మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. అందువలన బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top