Salt Side Effects: అసలింతకీ ఆహారంలో రోజుకి ఎంత ఉప్పు తీసుకోవాలి.. ?

Salt Side Effects:అమ్మో! ఉప్పా? ఎక్కువగా తినకూడదు.... అది ఆరోగ్యానికి హానికరం.... ఉప్పుతో జాగ్రత్త! అంటూ దాన్ని చూసి ఆమడ దూరం ఉండే వారే ఎక్కువగా కనపడతారు. అసలు ఉప్పు అనగానే అదేదో వినకూడని మాట విన్నట్టు ప్రవర్తించే వారే అధికం. అయితే ఉప్పు అంత హానికరం కాదని,దాని గురించి అనవసర భయాలు పెట్టుకోవద్దని నిపుణులు చెప్పుతున్నారు.

తీసుకొనే ఆహారంలో కొద్దిగా ఉప్పు ఎక్కువైనా ఎటువంటి నష్టం జరగదు. మనిషిని నడిపించే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పు కొద్ది మొత్తంలో ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెప్పుతున్నారు. ఒక్క గుండెకే కాదు ఇతర ఆరోగ్య సమస్యలకు,వంటింటి చిట్కాలకు,సౌందర్య పోషణలో ఉప్పు ఎంతగానో తోత్పడుతుంది.

ఉప్పు ఎంత తీసుకోవాలి?

ఉప్పు ఎంత తీసుకోవాలి అనే దాని మీద చాలా మందికి సరైన అవగాహన ఉండదు. సంవత్సరం నుండి మూడు సంవత్సరాల పిల్లలకు రోజుకి 2 గ్రాముల ఉప్పు సరిపోతుంది. అంతకు మించి వారికీ ఇవ్వటం హానికరం అని నిపుణులు చెప్పుతున్నారు. 

నాలుగు నుంచి ఆరు సంవత్సరాల వయస్సు వారికీ ఆహారం,చిరుతిళ్ళు ద్వారా రోజుకి 3 గ్రాముల ఉప్పు అందితే సరిపోతుంది. ఏడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయస్సు వారికీ 5 గ్రాముల ఉప్పు అందితే సరిపోతుంది.

పదకొండు సంవత్సరాలకు పైబడిన పిల్లలకు రోజుకి 6 గ్రాముల ఉప్పు తగ్గకుండా చూసుకోవాలి. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఉప్పు తీసుకొనే శాతం కూడా పెరుగుతుందని నిపుణులు చెప్పుతున్నారు. 

అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సాదారణ బరువు కలిగిన వ్యక్తులు ఉప్పు ఎక్కువగా తీసుకున్న వచ్చే నష్టం ఏమి ఉండదు. ఆహారం ద్వారా ఎంత ఉప్పు తీసుకోవాలనే విషయంలో డైటీషియన్ సలహా తీసుకోవటం కూడా మంచిదని నిపుణులు చెప్పుతున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top