Cardamom Benefits: :యాలకులు సుగంధ భరితమైన వాసనను వెదజల్లటమే కాకుండా చిన్ని చిన్ని ఆరోగ్య సమస్యలను కూడా రూపుమాపుతాయి. వీటిలో ఎంత సువాసన దాగి ఉన్నదో,అంతకు మించి ఆరోగ్య లాభాలు ఉన్నాయి.
కాల్షియం,ఐరన్,పోటాషియం,ప్రోటిన్,పైబర్,కార్బో హైడ్రేట్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి చూడటానికి చిన్నవిగా ఉన్నా కొన్ని రకాల రుగ్మతలకు మందుగా పనిచేస్తాయి.
అరుగుదలకు
ఆహారంను సక్రమంగా జీర్ణం చేయటంలో యాలకులు బాగా సహకరిస్తాయి. ఆహారం జీర్ణం కాకపోవుట వలన వచ్చే కడుపులో మంట లేదా నొప్పి నివారణకు యాలకులు బాగా పనిచేస్తుంది. కొన్ని యాలకులను పొడి చేసి,వాటికీ రెండు మూడు లవంగాలు కలిపి పాలల్లో వేసుకొని త్రాగితే మంచి పలితాన్ని పొందవచ్చు. అదే విధంగా టీ తయారుచేసుకున్నప్పుడు టీలో యాలకుల పొడి వేసుకున్నా ఎసిడిటి నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
నోటి దుర్వాసన
ఈ సమస్యను చిన్న,పెద్ద తేడా లేకుండా అందరూ ఎదుర్కొంటున్నారు. ఉదయం,సాయంత్రం నోటిని శుభ్రం చేసుకున్న దుర్వాసన పోవటం లేదని చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి వారు రెండు యాలకులను నమిలినటైతే ఈ దుర్వాసన నుండి తప్పించుకోవచ్చు.
ముత్ర సంబంధ వ్యాధులు
మూత్రపిండ సంబంద వ్యాదులతో బాధపడేవారు యాలకులు తీసుకోవటం ద్వారా నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఉసిరికాయ రసంలో ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని రోజులో మూడు సార్లు తీసుకోవాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేసినట్లతే మంచి పలితాన్ని పొందవచ్చు.
గొంతు నొప్పి
తరచుగా బాధించే సమస్యలలో గొంతు నొప్పి ఒకటి. అర లీటర్ నీటిలో కొన్ని యాలకులను వేసి మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి పుక్కిలించాలి. రోజు మొత్తంలో ఎన్నిసార్లు చేయగల్గితే అంత మంచిది. గొంతు నొప్పి నుండి త్వరగా ఉపశమనం కొరకు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


