Nutrition by Age:పోషకాహారం అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వారి వరకు అందరికి అవసరమే. ఒక్కొక్క వయస్సులో తీసుకోవలసిన ఆహారంలో కొద్దిగా మార్పులు చేర్పులు ఉంటాయి. ఏ వయస్సు వారు ఏలాంటి ఆహారం తీసుకోవాలి? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము.
పెరిగే పిల్లలు
13 నుంచి 18 సంవత్సరాల వయస్సులో శరీరం బరువు,ఎత్తు ఎక్కువగా పెరుగుతుంది. మెదడు కూడా సంపూర్ణంగా ఎదిగేది కూడా ఈ వయస్సులోనే. ఈ వయస్సు వారికీ పోషకాహారం అనేది తప్పనిసరి.
పాలు,పాలధారిత ఉత్పత్తులు,అన్ని రకాల పళ్ళతో పాటు సిట్రస్ అధికంగా లభించే పళ్ళు,గింజలు,తృణ ధాన్యాలు డ్రై ఫ్రూట్స్,చేపలు,ఆకుకూరలు,మాంసం గుడ్లు వంటివి ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి.
30-45 మధ్య వయస్సు వారికీ
నలబై సంవత్సరాలు దాటగానే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టూ ముట్టుతాయి. ఈ వయస్సులో సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే బ్రెడ్,గుడ్డులోని తెల్లసొన,కొవ్వు లేని మాంసం,వెన్న తీసిన పాలు,పెరుగు,తాజా పళ్ళు,కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి.
అయితే మాంసం,గుడ్డు,తీపి పదార్దాలు,బంగాళాదుంప వంటి దుంపకూరలు తీసుకోవటం సాధ్యమైనంత వరకు తగ్గించాలి. వీటిని ఆహారంలో తగిన మోతాదులో మాత్రమే చేర్చుకోవాలి.
50 సంవత్సరాల తర్వాత
ఈ వయస్సులో ఎక్కువగా నీరసం,వినికిడి శక్తి తగ్గటం,అధిక బరువు,కీళ్ళ నొప్పులు,గుండె జబ్బులు,అధిక రక్తపోటు,షుగర్ తదితర సమస్యలు చుట్టుముట్టుతాయి. ఈ సమస్యలు కొన్ని సందర్భాలలో చివరి వరకు ఉండిపోవచ్చు. వీరు ఆహారం తీసుకొనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవి పడితే అవి తినకూడదు.
తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వేపుడు పదార్దాలు,మసాలా పదార్దాల జోలికి అసలు పోకూడదు. పాలధారిత ఉత్పత్తులను తగ్గిస్తూనే పల్చని మజ్జిగను రోజు మొత్తంలో వీలు అయినన్ని సార్లు త్రాగాలి. షుగర్ ఉన్నవారు అసలు పండ్ల జోలికి వెళ్ళకూడదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


