Foods for Mental Health: ఈ మధ్య కాలంలో ఒత్తిడి అనేది సర్వ సాధారణం అయిపొయింది. ఒత్తిడిని తగ్గించటానికి కొన్ని ఆహారాలు ఉన్నాయి. వాటిని తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలను దూరం చేసుకోవచ్చు.
విటమిన్స్ లోపం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని మనందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఒత్తిడికి కూడా విటమిన్స్ లోపమే కారణమని నిపుణులు చెప్పుతున్నారు. ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్స్ తీసుకోవటం ద్వారా బాధించి,బయపెట్టే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
విటమిన్ బి
ఒత్తిడిని అధికమించే శక్తి విటమిన్ బికి ఉంది. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. బి1,బి2,బి3,బి5,బి6,బి12 ఒత్తిడిని సమర్దవంతముగా ఎదుర్కోవటానికి దోహదం చేస్తాయి.
ఆహారం
తృణ దాన్యాలు,గోదుమలు, దంపుడు బియ్యం,జొన్నలు, పెసలు,సెనగలు,మినుములు,కందులు లాంటి పప్పు దినుసులలోను,సోయా చిక్కుడు,బీట్ రూట్, బంగాళాదుంప,గుడ్డు వంటి వాటిలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది.
విటమిన్ బి1
ఈ విటమిన్ ను ఆహారంలో తీసుకోవటం వలన ఒత్తిడి,ఆందోళన తగ్గటమే కాకుండా మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడుకు సంబందించిన అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించటానికి దోహదం చేస్తుంది.
ఆహారం
బంగాళాదుంప,గుడ్డు,ఓట్స్,కాలీఫ్లవర్,సన్ ఫ్లవర్ గింజలు వంటి వాటిలో అధికంగా ఉంటుంది.
విటమిన్ బి2
శరీరానికి సంబందించిన అనేక జీవ ప్రక్రియలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. జీవ ప్రక్రియ సక్రమంగా జరుగుట వలన ఒత్తిడి అదుపులో ఉంటుంది. అంతేకాక నరాలు,కండరాల ఆరోగ్యానికి ఇది ఎంతో అవసరం.
ఆహారం
పాలు,పెరుగు,పాల కోవా,పాలపొడి,గోధుమపిండి,రాగులు,జొన్నలు,సజ్జలు,బార్లి,వేరుశనగ,కంది,మినప,పెసర,సోయాబీన్ వంటి వాటిలో పుష్కలంగా లభిస్తుంది.
విటమిన్ బి3
దీనిని నియాసిన్ అని కూడా అంటారు. దీనిని ఆహారం ద్వారా పొందటం వలన ఒత్తిడి,ఆందోళన,డిప్రెషన్ నుండి త్వరగా బయటపడవచ్చు. అలాగే మెదడు కూడా చురుకుగా ఉంటుంది.
ఆహారం
గోదుమలు,జొన్నలు,మొక్కజొన్నలు,బియ్యం వంటి తృణ ధాన్యాలతో పాటు,వేరుశనగ వంటి పప్పు దినిసులలోను,కాలేయం,మాంసం,చేపలు వంటి వాటిలో పుష్కలంగా ఉంటుంది.
విటమిన్ బి6
దీనిని ఫైరిడక్సిన్ అని కూడా అంటారు. నరాల బలహీనతను,ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు సహాయపడుతుంది.
ఆహారం
అరటి, బంగాళా దుంపలు, చేపలు, బఠాణి, చిక్కుడు గింజలు,గుడ్డులోని పచ్చసోన,కాలేయం,మాంసం వంటి వాటిలో పుష్కలంగా ఉంటుంది.
విటమిన్ బి12
మానసిక శ్రమను దూరం చేయటంతో పాటు,మూడ్ ను మార్చే శక్తి బి12 కి ఉన్నది. చికాకు,కోపం వంటి వాటిని దరి చేరనివ్వదు.
ఆహారం
మేక మాంసం,గొర్రె మాంసం,చేపలు,కోడిగుడ్డు,పాలు,పాలపొడి వంటి వాటిలో పుష్కలంగా ఉంటుంది.
విటమిన్ ఎ
ఆందోళన,ఒత్తిడిని దూరం చేసి మనస్సును ప్రశాంతంగా ఉంచటంతో పాటు మెదడును చురుకుగా ఉంచుతుంది.
ఆహారం
క్యారట్,బొప్పాయి,టమోటా,బఠాణి,మామిడి,బచ్చలి,మునగ,కరివేపాకు,కొత్తిమీర,ఆకుపచ్చ,పసుపుపచ్చని రంగు కలిగిన కురగాయాలలో అధికంగా ఉంటుంది.
విటమిన్ సి
నరాలను ఉత్తేజితం చేయటంతో పాటు,రక్త ప్రసరణను మెరుగుపరచి ఒత్తిడి,ఆందోళనను తగ్గిస్తుంది.
ఆహారం
నారింజ,నిమ్మ,టమోటా,ఉసిరి,జామ,బొప్పాయి, మామిడి వంటి పళ్ళతో పాటు క్యాబేజ్,కొత్తిమీర,ముల్లంగి ఆకు,బచ్చలి,చుక్కకూర వంటి ఆకుకూరలలో పుష్కలంగా లభిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


