Apple Benefits:రోజూ ఒక ఆపిల్ తినండి.. ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు

apple benefits
Apple benefits In telugu:'ఎ' ఫర్ ఆపిల్ అని చాలా చిన్న వయస్సు నుంచే పిల్లలకు ఆపిల్ పండును పరిచయం చేస్తాము. దీన్ని తీసుకుంటే వెంట ఒక డాక్టర్ ఉన్నట్టే అనే సంగతి అందరికి తెలిసిన విషయమే. దీనిని ఏ రూపంలో తీసుకున్నా అనుకున్నా పలితాన్ని పొందవచ్చు.

ఎముకల గట్టితనానికి
దీనిలోని ఫ్లోరిడ్జిన్ అనే ఫ్లేవనయిడ్ ఎముకలను దృడంగా ఉంచుతుందని ఇటివల నిర్వహించిన పరిశోదనలో తెలిసింది. స్త్రీలలో మోనోపాజ్ దశలో వచ్చే ఆస్టియోఫ్లోరోసిస్ ని కూడా ఇది అడ్డుకుంటుంది.

అస్తమా
చిన్న పిల్లలలో అస్తమా నివారణకు మందులతో పాటు వారికీ ఒక గ్లాస్ ఆపిల్ జ్యూస్ ఇచ్చినట్లయితే మరింత మంచి పలితాన్ని పొందవచ్చు. గర్భంతో ఉన్న స్త్రీ ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే పుట్టబోయే బిడ్డకు అస్తమా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

ఊపిరితిత్తుల క్యాన్సర్
ప్రతి రోజు ఒక ఆపిల్ తినటం ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ నుండి తప్పించుకోవచ్చని పరిశోదనలో తెలిసింది. సుమారు పదివేల మందిపై పరిశోదన చేసి ఈ విషయాన్నీ నిర్దారించారు. అలాగే రొమ్ము,కాలేయం క్యాన్సర్లు రాకుండా అడ్డుకొనే శక్తి కూడా ఉంది.

మదుమేహం
ఆపిల్ లోని పెక్టిన్ శరీరానికి అవసరమయ్యే గాలాక్ట్రానిక్ యాసిడ్ ను అందిస్తుంది. గాలాక్ట్రానిక్ యాసిడ్ శరీరంలోని ఇన్సులిన్ శాతాన్ని క్రమబద్దికరించటం ద్వారా మదుమేహ వ్యాది అదుపులో ఉంచటానికి సహాయపడుతుంది.

అధిక బరువు
అధిక బరువు తగ్గటానికి మందులు,రకరకాల పద్దతులు పాటించటం కన్నా రోజుకి మూడు ఆపిల్స్ తింటే బరువు తగ్గించుకోవచ్చని బ్రెజిల్ లో నిర్వహించిన ఒక పరిశోదన లో రుజువైనది. ఎలాంటి డైటింగ్ పద్దతులను పాటించకుండానే ఆపిల్స్ తినటం ద్వారా బరువు తగ్గవచ్చని పరిశోదకులు అంటున్నారు.

కొలస్ట్రాల్ తగ్గించటానికి
రోజుకి రెండు ఆపిల్స్ తినటం ద్వారా కొలస్ట్రాల్ ను గణనీయంగా తగ్గించుకోవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top