Kandi Pachadi:అమ్మమ్మ చేసే కంది పచ్చడి వేడి వేడి అన్నంలోకి కాసింత నెయ్యివేసి తింటే సూపర్ గా ఉంటుంది . ఆ pachhadi ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. చాలా సులభంగా చేసుకోవచ్చు.
కావలసిన పదార్దాలు
క౦దిపప్పు - ఒక కప్పు
శనగపప్పు - ఒక టేబుల్ స్పూన్
మినపప్పు - ఒక టేబుల్ స్పూన్
ఆవాలు - ఒక స్పూన్
జీలకర్ర - ఒక స్పూన్
మె౦తులు- ఒక స్పూన్
ఎ౦డుమిర్చి- ఎనిమిది
ఇ౦గువ - తగిన౦త
ఉప్పు - ఒక టేబుల్ స్పూన్
చి౦తప౦డు - నిమ్మకాయ౦త
నూనె - ఒక కప్పు
కొత్తిమీర - ఒక కట్ట
కరివేపాకు-ఒక రెబ్బ
తయారుచేసే విధాన౦:
పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె లేకుండా కందిపప్పును దోరగా వేగించి పక్కన పెట్టి చల్లార్చాలి. ఇప్పుడు అదే బాండిలో కొంచెం నూనె వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర,మె౦తులు,ఎ౦డుమిర్చి,కరివేపాకు అన్నీ వేసి వేగించాలి.
ఇవి చల్లారాక వీటిలో ఉప్పు,చి౦తప౦డు,కొత్తిమీర వేసి మిక్సీ చేయాలి. మిక్సీ చేసినప్పుడు అరకప్పు నీటిని పోయాలి. అప్పుడు మెత్తని పచ్చడిగా తయారవుతుంది. ఇప్పుడు మిగిలిన నూనెలో ఇంగువ వేసి వేడి చేసి చల్లారిన తర్వాత ఈ కంది పచ్చడిని కలపాలి.అంతే ఘుమ ఘుమలాడే కంది పచ్చడి రెడీ.