Tea : ఉదయం లేవగానే మనలో చాలా మంది టీ తాగుతూ ఉంటారు. అలాగే సాయంత్రం సమయంలో కూడా టీ తాగుతూ ఉంటారు. అలా టీ తాగినప్పుడు బిస్కెట్ లేదా ఏదోక స్నాక్ తింటూ ఉంటారు.
అలా కొన్ని ఆహారాలను టీ తో పాటు తినకూడదు. అలా తింటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టీతో పాటు డ్రై ఫ్రూట్స్ ఎప్పుడూ తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే టీలో టానిన్లు ఉంటాయి.
ఈ టానిన్లు ఆహారం నుండి ఐరన్ మరియు ఇతర ముఖ్యమైన పోషకాలను గ్రహించకుండా అడ్డుకుంటాయి. దాంతో శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. డ్రై ఫ్రూట్స్ లో ఐరన్ సమృద్దిగా ఉంటుంది.
టీతో పాటు డ్రై ఫ్రూట్స్ తింటే శరీరానికి ఐరన్ అందక రక్తహినత సమస్య వచ్చే అవకాశం ఉంది. టీతో కాకుండా వేరే సమయంలో డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. టీతో పాటు గ్రీన్ వెజిటేబుల్స్ కూడా తీసుకోకూడదు. ఆకుపచ్చ కూరగాయలలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది .
టీలో ఉండే టానిన్లు శరీరానికి అవసరమైన పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తాయి. అలాగే టీలో పసుపు వేసుకొని తాగకూడదు. ఎందుకంటే పసుపు, టీలో ఉండే టానిన్లు ఒకదానికొకటి సరిపడక జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow TeluguLifeStyle On Google News