Poha for Weight Loss:అటుకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా.. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారికి

Poha For Weight Loss
Poha for Weight Loss:బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఆరోగ్యకరమైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అలా తీసుకోవటం వలన రోజంతా హుషారుగా ఉండటానికి సహాయపడటమే కాకుండా బరువు తగ్గటానికి సహాయపడుతుంది.

అయితే మనలో చాలా మంది బ్రేక్ ఫాస్ట్ మానేస్తూ ఉంటారు. అలా చేయటం వలన బరువు తగ్గకుండా పెరుగుతారు. బ్రేక్ ఫాస్ట్ లో అటుకులను తీసుకుంటే బరువు తగ్గుతారు. అటుకులలో ఐరన్, ఫాస్పరస్, విటమిన్ సి, విటమిన్ ఎ మరియు పిండి పదార్థాలు, తక్కువ కేలరీలు ఉండుట వలన బరువు తగ్గడానికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

అటుకులలో పైబర్ కూడా సమృద్దిగా ఉంటుంది. జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది. కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉండేలా చేస్తుంది. అటుకులు చాలా త్వరగా జీర్ణం అవుతాయి. బరువు తగ్గటానికి అటుకులను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.

అటుకులతో ఏదైనా వంటకం తయారుచేసినప్పుడు చాల తక్కువ పరిమాణంలో ఆలివ్ నూనె లేదా నెయ్యి ను తీసుకోవాలి. అందులో కూరగాయలను కలపాలి. ప్రోటీన్ కోసం పనీర్ వేయవచ్చు.

ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం వేరుశెనగ లేదా జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. పావు ప్లేటు అటుకులను మాత్రమే తినాలి. ఉడికించిన అటుకులను తినటానికి ప్రయత్నించండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow TeluguLifeStyle On Google News
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top