Aloo Mixture: బంగాళదుంపతో ఎన్నో రకాలు చేసుకుంటాము. బంగాళదుంప అంటే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఇక బంగాళదుంపతో వెరైటీగా మిక్చర్ చేసుకుందాం.
కావలసిన వస్తువులు:
బంగాళదుంప తురుము – 2 కప్పులు
కార్న్ ఫ్లేక్స్ – 1 కప్పు
పల్లీలు – 1/4 కప్పు
కరివేపాకు – 2 రెబ్బలు
బఠానీలు – 1/4 కప్పు
ఎండుమిరపకాయలు – 4
పసుపు – చిటికెడు
కారం పొడి -1/2 స్పూన్
ధనియాల పొడి -1/2 స్పూన్
మిరియాల పొడి -చిటికెడు
పంచదార -1/2 స్పూన్
ఉప్పు -తగినంత
నూనె – వేయించడానికి
తయారుచేసే విధానం
బఠానీలను నాలుగు గంటలు నానబెట్టి ఉంచాలి. బంగాళదుంపలను చెక్కు తీసి కొంచెం లావుగా తురమాలి. ఈ బంగాళదుంప తురుమును నీటిలో వేసి కడిగి బాగా ఆరనివ్వాలి. ఇప్పుడు బాండి పెట్టి నూనె పోసి కాగిన తర్వాత దానిలో ఆరిన బంగాళదుంప తురుమును వేసి కరకరలాడేలా వేగించాలి.
ఆ తర్వాత అదే నూనెలో కార్న్ ఫ్లేక్స్, పల్లీలు,నానబెట్టుకున్న బఠానీలను కూడా వేగించాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేగించాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకోని దానిలో వేగించి పెట్టుకున్న బంగాళదుంప తురుము,కార్న్ ఫ్లేక్స్, పల్లీలు,బఠానీలు,ఎండుమిర్చి, కరివేపాకు అన్నింటిని వేసి,దానిలో కారంపొడి,ధనియాల పొడి, పసుపు,మిరియాల పొడి, పంచదార, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. అంతే ఎంతగానో నోరూరుంచే ఆలు మిక్చర్ రెడీ.