
కావాల్సిన పదార్థాలు
ఉల్లి పాయలు -3
పచ్చిమిర్చి -3
వెల్లుల్లి రెమ్మలు -6
సోంపు – 1/2టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
పుదీనా – కొద్దిగా
కరివేపాకు – 2 రెమ్మలు
కారం - 1/2టీ స్పూన్
శనగపిండి- 1 కప్పు
బియ్యం పండి – 2 టేబుల్ స్పూన్స్
బటర్ – 3 టేబుల్ స్పూన్స్
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
1.ముందుగా మీడియం సైజ్ ఉల్లిపాయలు పొడవుగా,కాస్త మందంగా కట్ చేసుకోవాలి.
2. ఒక మిక్సీ జార్ లో పర్చిమిర్చి కాయలు , వెల్లుల్లి రెమ్మలు, సోంపు వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయాలి.
3. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ను, కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలకు యాడ్ చేయాలి.
4. అందులోకి ఉప్పు, పూదీనా, కరివేపాకు, కారం వేసి చేతితో ప్రెస్ చేస్తూ కలపండి.
5. కలిపిన మిశ్రమానికి శనగపిండి, బియ్యం పిండి, బటర్ కలపి, ఆనియెన్స్ కు పట్టేలా పొడి పొడిగా తయారు చేసుకోవాలి.
6. అవసరమైతేనే నీళ్లు చల్లు కోవాలి. పిండిని పొడి పొడిగానే ఉండవనివ్వాలి
7. స్టవ్ పై బాండీ పెట్టి, డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి, వేడెక్కనివ్వాలి
8. పిండిని తీసుకుని, నూనెలో విడివిడిగా వేసుకోవాలి.
9. రెండు వైపులా ఎర్రగా వేగిన తర్వాత అందులోకి, కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి
10. రెండు బాగా వేగాక, జల్లి గరిటెలో తీసుకుని, ప్లేట్ లో టిష్యూ పేపర్ వేసి అందులో వేయాలి
11. అంతే వేడి వేడి బటర్ పకోడా రెడీ..