Pesala Kura Recipe:పెసలతో రుచికరమైన కూర, రైస్, చపాతీ రెండింటికి బాగుంటుంది

Pesala Kura Recipe Telugu: కందిపప్పు, పెసర పప్పు, శనగపప్పులు, కామన్ గా అందరు ఉండుకునే పప్పులే ఎంతో ఆరోగ్యకరమైన పెపలపప్పు కూర ట్రై చేసారు ఎప్పుడైనా, లేదంటే ఇప్పుడు ట్రై చేయండి.

కావాల్సిన పదార్థాలు
పెసలు – ఒక కప్పు
పసుపు -1/4టీ స్పూన్
నూనె -2 టేబుల్ స్పూన్స్
తాళింపు గింజలు - 1 టేబుల్ స్పూన్స్
వెలుల్లి రెబ్బలు -5
ఎండుమిర్చి -2
పచ్చిమిర్చి -5
ఉల్లిపాయ -1
కరివేపాకు – ఒక రెమ్మ
టమాట -2
ఉప్పు - తగినంత
పసుపు - – 1/4టీ స్పూన్
ధనియాల పొడి -1/2టీ స్పూన్
గరం మసాల -1/2టీ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం

1.పెసల పప్పు కూర కోసం, పెసలను ముందురోజు రాత్రి నానపెట్టుకోవాలి.

2. ఉదయం నానిన పెసలను శుభ్రంగా కడిగి, పెసలను కుక్కర్ లో వేసుకోవాలి.

3. ఏ కప్పుతో పెసలు తీసుకున్నారో, అదే కప్పుతో, 3 కప్పులు నీళ్లు పోసి, పసుపు వేసి, స్టవ్ ఆన్ చేసి,

కుక్కర్ ను పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ రానివ్వండి.

4. ప్రెషర్ పోయిన తర్వాత మెత్తగా ఉడికిన పెసలను, గరిటతో పైపైన కలపాలి.

5. స్టవ్ పై పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి , తాళింపు గింజలు వేసుకోవాలి, ఆ తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు , కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. ఎండు మిర్చి, పచ్చిమిర్చి తుంచుకుని వేసుకోవాలి.

5. పోపు వేగాక, ఉల్లిపోయ ముక్కలు వేసి రంగు మారేవరకు వేయించుకుని అందులో కరివేపాకు యాడ్ చేయాలి.

6. ఉల్లిపాయలు వేగాక ,టమాట ముక్కలు వేసి, తగినంత ఉప్పు, పసుపు వేసుకుని, మెత్తగా ఉండకనివ్వాలి.

7.అందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న, పెసల పప్పును వేసి బాగా మిక్స్ చేయాలి.

8.అందులో ధనియాల పొడి, గరం మాసాలా వేసి పల్చగా, వచ్చేలా నీరు పోసి కలపండి.

9. పాన్ కి మూత పెట్టేసి రెండు మూడు నిముషాలు ఉడకనివ్వండి.

10. కాస్త పల్చగా ఉన్నప్పుడే, స్టవ్ ఆఫ్ చేసుకుని, తరిగిన కొత్తిమీర చల్లుకుంటే, పెసల కూర రెడీ అయినట్లే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top