Cheese Pizza:ఎంతో ఖర్చుపెట్టి బయట కొనే పిజ్జాని ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా చేయండి

Cheese Pizza: జనరేషన్ మారింది. కల్చర్ మారింది. లైఫ్ స్టైల్ కూడా మారింది. అన్నిటితో పాటు, మరి ఫుల్ స్టైల్ కూడా మారిపోతుంది కదా. ఫాస్ట్ జనరేషన్ కు పాష్ ఫుడ్ అలవాటైంది. అదేనండి పిజ్జా, బర్గర్ లాంటివి .. ఏ పిజ్జా హట్ వెళ్లకుండా, ఖర్చు లేకుండా, ఇంట్లోనే చీజ్ పిజ్జా చేసేద్దాం.

కావాల్సిన పదార్దాలు

మైదా – 1 కప్పు
చక్కెర – 1 టీ స్పూన్
ఉప్పు - 1/2టీ స్పూన్
బేకింగ్ పౌడర్ - 1 టీ స్పూన్
బేకింగ్ సోడా -1/4టీ స్పూన్
బటర్ -1 టేబుల్ స్పూన్
పెరుగు – తగినంత
నూనె - తగినంత
చీజ్ స్లైసెస్ -
పిజ్జా సాస్
ఉల్లిపాయ
టమాటలు
కాప్పికమ్
స్వీట్ కార్న్
ఆలివ్స్
చిల్లీ ఫ్లెక్స్
పిజ్జా మిక్స్
ఆరిగామ

తయారీ విధానం

1.చీజ్ పిజ్జా తయారీ కోసం ఒక గిన్నెలో మైదా వేసి, టేబుల్ స్పూన్ చెక్కర, ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా , బటర్ యాడ్ చేసి, ఉండలు లేకుండా కలుపుకోవాలి.

2. ఇప్పుడు కొంచెం కొంచెం పెరుగు వేసుకుంటూ, చపాతి పిండికన్నా లూజ్ గా ఉండేలా కలుపుకోవాలి.

3. ఇప్పుడు చేతికి అంటుకోకుండా ఆయిల్ రాసుకుని, మెత్తటి ముద్దగా తయారు చేసుకోవాలి.

4. పిండిముద్ద పై ఆయిల్ అప్లై చేసి, గిన్నెపై మూత పెట్టి 10 నిముషాలు పక్కన పెట్టాలి.

5. ఒక చపాతి పీట తీసుకుని, దాని పై పల్చగా మైదా చల్లుకోని, సాప్ట్ గా తయారు చేసిన పిండిముద్దను,

మూడ సమాన భాగులుగా కట్ చేసుకోవాలి.

6. అందులో రెండు భాగాలు పక్కనపెట్టుకోవాలి.

7. ఒక భాగం పిండి ముద్దను చపాతి పీటపై కర్ర సహాయంతో పిజ్జా బేస్ తయారు చేసుకోవాలి.

8. స్టవ్ పై పాన్ పెట్టుకుని, పిజ్జా బేస్ ను రెండు వైపులా లైట్ గా కాల్చుకోవాలి.

9.మందపాటి బాండీ తీసుకుని, అడుగున ఉప్పు పరిచి, దాని పై స్టాండ్ పెట్టి, బాండీ కి మూత పెట్టుకుని,

సిమ్ లో వేడి చేసుకోవాలి.

10. గుండ్రటి ప్లేట్ ఒకట తీసుకుని, దాని పై ఆయిల్ వేసి, అంచులకు అప్లై చేసి, మైదాను, పల్చగా చల్లుకోవాలి.

11. పక్కన పెట్టుకున్న రెండు భాగాల పిండిని , ఆ ప్లేట్ లో పిజ్జా బేస్ మందగా తయారు చేసుకోవాలి.

12. మందంగా చేసుకుని, అంచులు కాస్త, పైకి వత్తుకోవాలి.

13. ఇప్పుడు బేస్ పై ఫోర్క్ తో గుచ్చుతూ హోల్స్ చేయాలి.

14. దాని పై చీజ్ స్లైసెస్ పరుచుకోవాలి

15. చీజ్ పై మందంగా కాల్చి పెట్టుకున్న, పిజ్జా బేస్ పెట్టాలి. అంచులను క్లోజ్ చేసుకోవాలి.

16. ఇప్పుడు మళ్లీ ఫోర్క్ తో బేస్ పై హోల్స్ చేయాలి. దాని పై పిజ్జా సాస్ వేసి స్ప్రెడ్ చేయాలి.

19. కట్ చేసుకున్న టమాటా,కాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు పెట్టుకోవాలి.

20. స్వీట్ కార్న్ వేసి, చాప్ చేసుకున్న చీజ్ ను వేయాలి.

21.దానిపై ఆలివ్స్ పెట్టి, చల్లీ ఫ్లేక్స్, పిజ్జా మిక్స్, ఆరిగానో చెల్లుకోవాలి.

22. రెడీ చేసుకున్న పిజ్జాను ముందుగా వేడి చేసుకుంటున్న బాండీలో పెట్టి, మూత పెట్టుకుని, పది నుంచు 15 నిముషాలు బేక్ చేసుకోవాలి.

23. బేక్ అయిన పిజ్జాను బయటకి తీసి, అట్ల కాడ సాయంతో వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ ఫర్ చేయాలి.

24. ముక్కలుగా కట్ చేసుకుంటే చీజ్ పిజ్జా రెడి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top