Bengali Style Potato Curry: సర్వసాధారణంగా వెజ్ మెనూలో ,మెయిన్ రెసీపీ బంగాళ దుంప స్పెషల్స్ ఉంటాయి. నార్త్ ఇండియన్స్ కు ఎంతో ఫేవరేట్. ఆలు ధమ్ రెసీపీని ఎలా చేయాలో చూసేద్దాం.కావాల్సిన పదార్ధాలు
ఉడకపెట్టిన ఆలు ముక్కలు – 300 గ్రాములు
పసుపు – 2 చిటికెలు
ఉప్పు – తగినంత
నూనె – ఫ్రైకి సరిపడా
అల్లం- 1 ఇంచ్
వెల్లుల్లి – 5 నుంచి 6
పచ్చిమిర్చి -3
ఎండుమిర్చి-3
ఆవ నూనె – 3 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – 1 టీ స్పూన్
బిర్యాని ఆకు – 1
దాల్చిన చెక్క – 1 ఇంచ్
ఉల్లిపాయలు – 1
పసుపు – 2 చిటికెలు
ధనియాల పొడి – ¾ టీస్పూన్స్
జీలకర్ర పొడి – ½ టీస్పూన్స్
కారం – 1/2టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా..
చిలికిన పెరుగు - 1/2కప్పు
కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్స్
గరం మసాలా - 1/4టీస్పూన్
తయారీవిధానం
1.ముందుగా కుక్కర్ లోకి తొక్క తీసిన ఆలు, పసుపు, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టుకుని, ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టీమ్ పోయేవరకు చల్లార నివ్వాలి.
2.చల్లారిన ఆలూను ముక్కలుగా కట్ చేసుకుని, నూనెలో వేసి, డీప్ ఫ్రై చేస్తూ, ఎర్రగా వేపుకోవాలి.
3. ఇప్పుడు అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, వేసి కచ్చా పచ్చాగా దంచి పక్కన ఉంచుకోవాలి.
4. స్టవ్ పై బాండీ పెట్టుకుని, ఆవ నూనె పోసి, బాగా వేడెక్కిన తర్వాత ఎండు మిర్చి, జీలకర్ర, బిర్యాని ఆకు, దాల్చిన చెక్క, వేసుకుని వేపుకోవాలి.
5. వేగిన తాళింపులో, ఉల్లిపాయలు, దంచుకున్న అల్లం, పచ్చిమిర్చి ముద్ద వేసి, నూనె తేలెవరకు ఫ్రై చేసుకోవాలి. అందులోకి పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి మరో మారు కలుపుకోవాలి.
6. మసాలాలు వేగిన తర్వాత చిలికిన పెరుగు వేసి, మీడియం ఫ్లేమ్ పై కలుపుతూ ఉండాలి.
7. పెరుగు కూరలో కలసిపోయి, నూనె పైకి వస్తున్న సమయంలో ఉడకపెట్టి వేపుకున్న ఆలు ముక్కలును వేసి, ఇరిగిపోకుండా నెమ్మదిగా, కలపాలి.
8. ఇప్పుడు అందులోకి నీళ్లుపోసి, లో ఫ్లేమ్ పై, మూత పెట్టుకుని, ఉడికించుకోవాలి.
9. నూనె పైకి తేలాక చివరగా, కొత్తిమీర తరుగు, గరం మాసాల,చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే,
ఆలు ధమ్ రెడీ అయినట్లే.

