Andhra Style Green Chilli Chutney: తెలుగు వారికి కూరలు ఎంత ముఖ్యమో, రోటి పచ్చళ్లు కూడా అంతే ముఖ్యం. ఒక్క పచ్చడి ఉంటే చాలు, కూరలు లేకపోయినా సరిపెట్టేస్తారు. రోటి పచ్చళ్లలో వాడే, పచ్చిమిర్చితో పచ్చడి చేస్తే, ఎలా ఉంటుందో చూడండి.
కావాల్సిన పదార్ధాలు
మసాలా కోసం ..
నూనె – 1 టేబుల్ స్పూన్
మెంతులు – 1/2టీ స్పూన్
ఆవాలు – 1 టీస్పన్
మినపప్పు – 1 టీస్పూన్
కరివేపాకు – 1 రెమ్మ
జీలకర్ర – 1 స్పూన్
చెట్నీ కోసం..
పచ్చిమిర్చి – 300 గ్రాములు
నూనె – 4నుంచి 5 టేబుల్ స్పూన్స్
చింతపండు రసం – 4 టేబుల్ స్పూన్స్
బెల్లం – 1 స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం
1.స్టవ్ పై పాన్ పెట్టుకుని, నూనె వేడి చేసి, ఆవాలు, మెంతలు వేసి, మెంతులు వేసి, ఎర్రగా వేపుకోవాలి.
2.వేగిన మెంతులలో, మినపప్పు, జీలకర్ర, వేసి వేపుకుని, చల్ల బడ్డాక, మిక్కీలో మెత్తిన పొడి చేసుకోవాలి.
3.ఇప్పుడు అదే బాండీలో మరింత నూనె వేసుకుని,అందులోకి పచ్చిమిరపకాయలు వేసి, మూత పెట్టుకుని లో ఫ్లేమ్ పై మిర్చిని మగ్గనివ్వాలి.
4.మగ్గిన మిర్చి, మిక్కీలో వేసుకుని, అందులో, చింతపండు గుజ్జు, ఉప్పు, బెల్లం, ముందుగా గ్రైండ్ చేసిపెట్టుకున్న, తాలింపు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
5. అంతే, 15 రోజుల వరకు నిల్వ ఉండే పచ్చిమిర్చి పచ్చడి రెడీ.


