Bachala Aaku Pappu:బచ్చలి కూర పప్పు ఇలా చేయండి.. చాలా రుచిగా ఉంటుంది

Bachala aaku pappuBachala Aaku Pappu:వేడి వేడి అన్నం, కమ్మని పప్పు, కాసింత నెయ్యి, ఇంతకు మించిన పరమాన్నం ఉండదు అంటే, అతిశయోక్తి కాదు. బలానికి మంచి మందు, బచ్చలి కూర. పప్పుతో కలపి చేసారంటే, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

కావాల్సిన పదార్ధాలు
కందిపప్పు – 1/2కప్పు
పెసరపప్పు – 2 టీ స్పూన్స్
పచ్చిశనగరపప్పు – 2 టేబుల్ స్పూన్స్
పసుపు – 1/4టీస్పూన్
పచ్చిమిర్చి – 4
బచ్చలి ఆకు – 250 గ్రాములు
చింతపండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్స్
ఉప్పు – తగినంత
నూనె – 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టీ స్పూన్
పచ్చిశనగరప్పు – 1 టీ స్పూన్
మినపప్పు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1/2టీ స్పూన్
ఎండుమిర్చి -2
ఇంగువ – 2 చిటికెలు
టమాటో – 1/4కప్పు
కరివేపాకు – 1 రెమ్మ

తయారీ విధానం

1.ముందుగా ఒక కుక్కర్ లోకి నాన పెట్టుకున్న కందిప్పుపు, పెసరపప్పు, పచ్చిశనగరపప్పు, పసుపు, పచ్చిమిర్చి, బచ్చలికూర వేసుకుని, తగినన్ని నీళ్లు పోసుకుని, మూత పెట్టుకుని, 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

2. ఆవిరి పోయాక కుక్కర్ మూత తీసి, పప్పును మెత్తగా రుబ్బుకుని, అందులోకి చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు వేసి, ఒక పొంగు వరకు ఉడికించాలి.

3. తాళింపు కోసం స్టవ్ పై పాన్ పెట్టుకుని, నూనె వేడి చేసి, అందులోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, టమాటో ముక్కలు, ఇంగువ , కరివేపాకు వేసి వేగనివ్వాలి.

5. వేగిన తాళింపును పప్పులో కలుపుకుని సెర్వ్ చేసుకోవడమే..
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top