Jogging Health benefits:శారీరక,మానసిక ఆరోగ్యాలకి జాగింగ్ మించిన వ్యాయామం లేదు. క్రమం తప్పకుండా జాగింగ్ చేయుట వలన లోపలికి పిల్చుకొనే గాలి ఎక్కువై ఊపిరితిత్తులు సమర్దవంతముగా పనిచేస్తాయని నిపుణులు చెప్పుతున్నారు. జాగింగ్ వలన ఉపయోగాలు,ఏ విధంగా,ఎప్పుడు,ఎక్కడ చేయాలో తెలుసుకుందాము.
ఉపయోగాలు
రక్త ప్రసరణ సక్రమంగా సాగటంతో పాటు కండరాల పటుత్వానికి దోహదం చేస్తాయి. వయస్సుతో పని లేకుండా అందరు సులభంగా చేసుకోవచ్చు. అయితే షుగర్,బిపి ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా తీసుకోని మాత్రమే జాగింగ్ చేయాలి.
ధూమపానం కారణంగా ఊపిరితిత్తులకు నష్టం కలుగుతుంది. జాగింగ్ కారణంగా ఈ నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అధిక బరువు అనేది చాలా మందిని భాదిస్తున్న సమస్య. జాగింగ్ చేయుట వలన ఈ సమస్య నుండి పూర్తిగా విముక్తి పొందవచ్చు.
గుండె అధిక రక్తాన్ని పంప్ చేస్తూ బలంగా ఉంటుంది. బిపి తగ్గటంతో పాటు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలు విశాలం అవుతాయి.
ఎలా ...... ఎప్పుడు చేయాలి?
జాగింగ్ చేయటానికి ముందుగా శరీరాన్ని సిద్ధం చేసుకోవలసిన అవసరం లేదు. కాకపోతే నిదానంగా ప్రారంభించటం మంచిది. మొదట అరకిలో మీటర్ తో ప్రారంభించి అనంతరం వేగం,దూరం పెంచాలి.
జాగింగ్ చేయటానికి ప్రత్యేకించి సమయం అవసరం లేకపోయినా,తెల్లవారుజామున చేయటం మంచిదని నిపుణులు చెప్పుతున్నారు.
తారు రోడ్డు,కంకర రోడ్డు మీద కన్నా తోటలు,ఆట స్థలాల్లో జాగింగ్ చేయటం మంచిది. గట్టి నేల మీద ఎక్కువ దూరం పరిగెడితే మోకాళ్ళకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
వయస్సు,శరీర బరువు ఆధారంగా ఎంత దూరం జాగింగ్ చేయాలనేది నిర్ణయించుకోవాలి. ఈ విషయంలో నిపుణుల సలహా తీసుకోవటం మంచిది. అయితే సొంత నిర్ణయాలు కొన్ని సందర్భాలలో కీడు చేయవచ్చు.
మధ్య వయస్సులో ఉన్న స్త్రీ,పురుషులు 5 కిలో మీటర్స్ కన్నా ఎక్కువ దూరం జాగింగ్ చేయకూడదు.
ఎనిమిది నుంచి పది కిలో మీటర్స్ జాగింగ్ చేసేవారు వారంలో నాలుగు సార్లు చేస్తే సరిపోతుంది.
ప్రారంభంలో ఆరు నిమిషాలకు ఒక కిలో మీటర్ దూరం పరిగెట్టాలి.