Mushroom Capsicum Kurma:మష్రూమ్స్ లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని తినాలంటే కాస్త వెరైటీగా చేసుకుంటేనే తినగలం. అలా పనీర్ తో కలిసి గ్రేవీ curry చేసుకుంటే చాలా బాగుంటుంది.
కావలసిన వస్తువులు:
మష్రుమ్స్ - 250 గ్రామ్స్
పనీర్ – 200 గ్రామ్స్
క్యాప్సికమ్ – 100 గ్రామ్స్
ఉల్లిపాయ – 1
వెన్న – 2 స్పూన్స్
నూనె – 2 స్పూన్స్
పచ్చిమిర్చి – 3
టమాటా – 2
జీలకర్ర పొడి – 1 స్పూన్
ధనియాల పొడి – 2 స్పూన్స్
గరం మసాలా పొడి – 1/4 స్పూన్
కొబ్బరి పొడి – 3 స్పూన్
కారం పొడి – 1 స్పూన్
జీడిపప్పు ముద్ద – 3 స్పూన్స్
అల్లం వెల్లుల్లి ముద్ద – 1 స్పూన్
కొత్తిమిర – కొద్దిగా
ఉప్పు – తగినంత
తయారుచేసే విధానం
మష్రుమ్స్ ను అర అంగుళం సైజులో కట్ చేసి ఉంచుకోవాలి. పనీర్ ను అంగుళం సైజు లో ముక్కలుగా కట్ చేసి వేడి నూనెలో గోల్డ్ కలర్ వచ్చేవరకు వేగించి గోరువెచ్చని నీటిలో వేసి పది నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల పనీర్ మృదువుగా ఉంటుంది.
ఒక ప్యాన్ తీసుకోని పొయ్యి మీద పెట్టి నూనె, వెన్న వేసి వేడి చేసి దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగించాలి. ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, కారం పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా వేగాక క్యాప్సికం ముక్కలు, టమాటా ముక్కలు వేసి వేయించాలి.
అవి కొద్దిగా వేగాక జీడిపప్పు ముద్ద, కొబ్బరిపొడి, గరం మసాలా, మష్రుమ్స్ ముక్కలు వేసి వేగించాలి. తర్వాత పనీర్ ముక్కలు, తగినంత ఉప్పు, అర కప్పు నీళ్లు పోసి మొత్తం కలిపి మూతపెట్టి నూనె తేలేవరకు ఉడికించి కొత్తిమిర చల్లి దింపేయాలి. ఈ కూర అన్నం, చపాతీలకు మంచి కాంబినేషన్.