Rice Water Benefits:మనం సాదారణంగా బియ్యం కడిగిన నీటిని పారబోస్తూ ఉంటాం. అయితే ఆ నీటిలో ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ రకాల పోషకాలు ఉంటాయి. బియ్యం నీరు జుట్టు సంరక్షణ ,చర్మ సంరక్షణ లో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
ఒక బౌల్ లో అరకప్పు రైస్ వాటర్ తీసుకోని దానిలో రెండు స్పూన్ల అలోవేర జెల్ వేసి బాగా కలిపి ముఖానికి రాసి 5 నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. మొటిమలు,మచ్చలను తగ్గిస్తుంది.
అరకప్పు రైస్ వాటర్‌లో ఒక టీస్పూన్ పసుపు పొడిని కలిపి ముఖానికి రాస్తే నల్లని మచ్చలు తొలగి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
బియ్యం నీటిలో ఆక్సిడెంట్లు ,విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పసుపులోని కర్కుమిన్ మరింత శక్తివంతమైనది. ఇది మొటిమలను తొలగించి, చర్మానికి మెరుపు తెచ్చేలా పనిచేస్తుంది.
బియ్యం నీళ్లలో అర చెక్క నిమ్మకాయ రసాన్ని కలిపి ముఖానికి రాస్తే టానింగ్ ,సన్ బర్న్ వంటి సమస్యల నుండి బయటపడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


