Pesara Purnam burelu: పూజల్లో కనిపించే స్పెషల్ పూర్ణమే. పండగలు, వ్రతాలు, శుభకార్యాలు,ఏమి జరిగినా.. అన్నిటికీ పూర్ణాలే మొదటి స్వీట్స్. పెసరపప్పుతో పూర్ణాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సారి మీ ఇంట్లో పూజలకి పెసర బూరెలు ట్రై చేయండి.
కావాల్సిన పదార్థాలు
మినపప్పు – 1/2 కప్పు
బియ్యం పిండి – 1 కప్పు
ఉప్పు – చిటికెడు
పెసరపప్పు పూర్ణానికి..
పెసరపప్పు – 1 కప్పు
పచ్చి కొబ్బరి తురుము – 1 కప్పు
బెల్లం తురుము – 1 1/4 కప్పు
యాలకుల పొడి - 1/2 టీ స్పూన్
నెయ్యి – 1 టీస్పూన్
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
1.బియ్యం పిండిలో ఉప్పు వేసుకుని, తగినిన్ని నీళ్లు పోసి, మెత్తగా తడుపుకుని, గంటపాటు నానపెట్టాలి.
2.ఇప్పుడు మెత్తగా నానిన మినపప్పును గ్రైండ్ చేసుకోవాలి.
3.తర్వాత నానపెట్టుకున్న బియ్యంపిండిలో రుబ్బుకున్న మినప్పిండిలో తగినన్ని నీళ్లను కలిపి, కొద్దిగా జారుగా, వేసుకుని పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు నానిన పెరసపప్పులో కాసిన్ని నీళ్లు పోసి, అంత చిక్కగా, అట్లపిండి అంత మెత్తగా రుబ్బుకుని, ఇడ్లీ ప్లేట్స్ లో,
5 నిముషాల పాటు హై ఫ్లైమ్ 4 నిముషాలు లో ఫ్లేమ్ పై కుక్ చేసుకోవాలి.
6. ఇప్పుడు ఉడికిన ఇడ్లీలను చల్లార్చి, ముక్కలుగా చేసుకుని, రవ్వగా తయారు చేసుకోవాలి.
7. ఇప్పుడొక పాన్ లో నెయ్యిని కరిగించి, కొబ్బరి తరుమును వేసి, ఒక నిముషం వేపుకోవాలి.
8. వేగిన కొబ్బరిలో బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి కరిగే వరకు ఒక పొంగు రానివ్వాలి.
9. పొంగుతున్న బెల్లం పాకంలో రవ్వగా చేసుకున్న పెసరపప్పును, చేతితో చిదుముతూ పాకంలో వేసుకోవాలి.
10. బాగా కలిపి పూర్ణాన్ని చల్లారనివ్వాలి.
11. ఇప్పుడు పూర్ణాలను చిన్న చిన్న ఉండలుగా చుట్టి పెట్టుకోవాలి.
12. ఇప్పుడు ఒకోక్క పూర్ణం ముద్దను ముందుగా రుబ్టి పెట్టుకున్న బియ్యం పిండిలో ముంచి , నెమ్మదిగా, వేడి నీటిలో వేసి, మీడియం ఫ్లేమ్ పై కాల్చుకోవాలి.
13. అంతే.. వేడి వేడి పెసర బూరెలు రెడీ అయినట్లే..


