Stomach Pain Home remedies: కడుపు నొప్పి వచ్చినప్పుడు మనలో చాలా మంది మెడికల్ షాప్ కి వెళ్లి టాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి పలితం ఉంటుంది.
వాము
ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ వాము వేసి మరిగించాలి. ఆ నీటిని వడకట్టి చల్లారిన తర్వాత తాగితే కడుపునొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. కడుపునొప్పి వచ్చినప్పుడే కాకుండా అప్పుడప్పుడు కూడా ఈ నీటిని తాగవచ్చు.
నిమ్మ టీ
నిమ్మ టీ లో కొన్ని తేనే చుక్కలు కలిపి తాగితే కడుపునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ టీని వేడిగానే తాగాలి. టీని మరిగించేటప్పుడే చిన్న అల్లం ముక్క వేయాలి. బాగా కాగిన తర్వాత టీని వడకట్టి తాగాలి. ఇది కడుపునొప్పి తగ్గించటానికి సమర్ధవంతముగా పనిచేస్తుంది.
పుదినా రసం
గ్లాస్ వేడి నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ పుదినా రసం,కొద్దిగా అల్లం రసం,చిటికెడు నల్ల ఉప్పు కలిపి తాగితే కడుపునొప్పి నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది.
పెరుగు
నాలుగు స్పూన్ల పెరుగులో కొద్దిగా జీలకర్ర,కొద్దిగా మెంతులు నానబెట్టి తినాలి. రోజులో ఈ విధంగా రెండు సార్లు చేస్తే కడుపునొప్పి తగ్గే అవకాశం ఉంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


