Wedding style Rasam Rice:అన్నం, కూర ,పచ్చడి, పెరుగు, ఎన్ని ఉన్నా, రసంతో ఒక రెండు ముద్దలు తింటే, వచ్చే తృప్తే వేరు. రసంలో కలపి చేసే, అన్నం..అదేనండీ కర్నాటక స్టైల్ రసం రైస్, ఒకసారి టేస్ట్ చేసారంటే, రుచి ఎప్పటికీ మర్చిపోరు.
కావాల్సిన పదార్ధాలు
బియ్యం – 1 కప్పు
టమాటో – 1
చింతపండు – 50 గ్రాములు
ఉప్పు – తగినంత
రసం పొడి – 1.5 టేబుల్ స్పూన్స్
పసుపు – ¼ టీస్పూన్స్
పెసరపప్పు – 2 టేబుల్ స్పూన్స్
కందిపప్పు – 2 టేబుల్ స్పూన్స్
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టీ స్పూన్
ఇంగువ – 1/4టీ స్పూన్
ఎండుమిర్చి -2
జీలకర్ర – 1 టీ స్పూన్
పచ్చిమిర్చి – 2
కరివేపాకు రెబ్బలు – 2
కొత్తిమీర తరుగు – చిన్న కట్ట
తయారీ విధానం
1.ముందుగా ఒక కుక్కర్ లో నానపెట్టిన బియ్యంలో పసుపు,నీళ్లు, టమాటో, పెసరపప్పు, కందిపప్పు, వేసి, నాలుగు కప్పుల నీల్లు పోసి, మీడియం ఫ్లేమ్ పై 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి.
2. ఇప్పుడు చింతపండు గుజ్జులో ఉప్పు, రసం పొడి వేసి, కలిపి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఉడికిన అన్నంలోకి , నీళ్లు , చింతపండు గుజ్జు పోసి, అన్నాన్ని కాస్త చిదుముకోవాలి. ఒక నిముషం పాటు ఉడికిన తర్వాత దించేసుకోవాలి.
4. తాళింపు కోసం, పాన్ పెట్టి స్టవ్ పై ఆయిల్ వేసుకుని, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు, ఇంగువ వేసుకుని, చివరగా కొత్తిమీర వేసుకుని, వేగిన తాళింపును రసం అన్నంలోకి కలుపుకోవాలి.
5. అంతే రసం రైస్ తయారైనట్లే..


