Paneer Lollipop: పనీర్ తో ఎన్నో రకాల వంటలను చేసుకుంటూ ఉంటాం. అలా ఎక్కువగా పనీర్ తో చేసే వంటలు బోర్ కొట్టినప్పుడు ఇలా Paneer Lollipop చేసుకుంటే చాలా బాగుంటుంది.
కావలసిన వస్తువులు:
బంగాళదుంపలు – 2
బేబీ కార్న్ – 6
పనీర్ – 1/4 కప్పు
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 4
కొత్తిమిర – 3 స్పూన్స్
అల్లం వెల్లుల్లి ముద్ద – 1 స్పూన్
సోయా సాస్ – 1/4 స్పూన్
అజినొమొటొ – చిటికెడు
కార్న్‌ఫ్లోర్ – 3 స్పూన్స్
మైదా – 1/2 కప్పు
మిరియాల పొడి – 1/2 స్పూన్
ఉప్పు – తగినంత
నూనె – వేయించడానికి
తయారుచేసే విధానం
బంగాళదుంపలను మెత్తగా ఉడికించి చల్లారాక పై తొక్క తీసి ఒక గిన్నెలో వేసి మెత్తగా చిదపాలి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమిర,ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. పనీర్ కూడా సన్నగా తురిమి ఇందులో కలపాలి.
తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, అజినొమొటొ, మిరియాలపొడి,సోయా సాస్, కార్న్‌ఫ్లోర్ వేసి మొత్తం బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా పెద్ద సైజు నిమ్మకాయలంత ఉండలు చేసుకోవాలి.బేబీ కార్న్ లావుగా ఉన్నవైపు ఈ మిశ్రమాన్ని కొంచెం పెట్టి గుండ్రంగా చుట్టాలి. దాన్ని వత్తుతూ కొంచెం వెడల్పు చేసి మైదా పిండిలో దొర్లించాలి.
మొత్తం అన్నింటిని ఇలా మైదాలో దొర్లించి పక్కన పెట్టుకొవాలి.ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక పైన తయారుచేసుకున్న వాటిని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి. అంతే పనీర్ లాలిపాప్స్ రెడీ. వీటికి టమాటా సాస్ మంచి కాంబినేషన్.