Hair Growth:కొబ్బరి నూనెలో వీటిని కలిపి రాస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది

Coconut For Hair loss
Hair Growth: ప్రతి రోజు మనం జుట్టుకు కొబ్బరి నూనెను రాస్తూ ఉంటాం. కొబ్బరి నూనెలో ఇప్పుడు చెప్పిన వాటిని కలిపి రాస్తే జుట్టుకి మరింత పోషణ అంది జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు సంరక్షణలో కొబ్బరి నూనె కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది.

ఒక గిన్నెలో రెండు స్పూన్ల కొబ్బరి నూనె, 10 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ ( రోజ్మేరీ ఆయిల్, లావెండర్ ఆయిల్, పిప్పరమింట్ ఆయిల్ మరియు టీ ట్రీ ఆయిల్ ) ని కలిపి జుట్టుకి పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి.

పెద్ద కలబంద ఆకును పొడవుగా కట్ చేసి లోపల ఉన్న జెల్‌ను బయటకు తీయాలి. ఒక గిన్నెలో రెండు స్పూన్ల కలబంద జెల్,రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలిపి జుట్టు మరియు తలకు పట్టించి, మసాజ్ చేయండి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

రెండు స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక స్పూన్ ఆముదం వేసి బాగా కలిపి జుట్టుకి పట్టించాలి. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి సహాయపడుతుంది. ఇప్పుడు చెప్పిన చిట్కాలు అన్ని సమర్ధవంతంగా పనిచేస్తాయి.

జుట్టు పెరుగుదలను ప్రేరేపించడానికి కొబ్బరి నూనె ఒక అద్భుతమైన పదార్ధంగా చెప్పవచ్చు. ముఖ్యమైన నూనెలు, కలబంద, ఆముదం వంటివి ఇతర సహజ పదార్ధాలతో కలిపినప్పుడు , జుట్టుకు మరింత శక్తివంతమైన ప్రయోజనాలను అందించటంలో సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Click Here To Follow TeluguLifeStyle On Google News
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top