Uric Acid:యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు తీసుకొనే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆహారాలు శరీరంలో Uric Acid స్థాయిలను పెంచుతాయి. కొన్ని ఆహారాలు Uric Acid స్థాయిలను తగ్గిస్తాయి.
అయితే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు బ్రోకలీ తింటే ఏమి అవుతుందో తెలుసుకుందాం. చికెన్, మాంసం, చేపలు మరియు పాల ఉత్పత్తుల నుండి ప్రోటీన్లు ప్యూరిన్ అని పిలువబడే ఒక రకమైన అణువును కలిగి ఉంటాయి. ఈ ప్యూరిన్ విచ్ఛిన్నమైనప్పుడు, అది కాలేయం, ప్రేగులు మరియు కొంతవరకు కండరాలు మరియు మూత్రపిండాలలో యూరిక్ యాసిడ్‌గా మారుతుంది.
ఈ యూరిక్ యాసిడ్ శరీరం నుండి మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. యూరిక్ యాసిడ్ బయటకు పోకుండా శరీరంలో ఉండిపోయినప్పుడు సమస్యలు వస్తాయి. ఇటివల జరిగిన పరిశోదనలలో విటమిన్ సి శరీరం నుండి యూరిక్ యాసిడ్‌ను ఫ్లష్ చేయగలదని నిరూపణ జరిగింది.
బ్రోకలీలో విటమిన్ సి చాలా సమృద్దిగా ఉంటుంది. ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరచి శరీరం నుండి యూరిక్ స్థాయిలను తగ్గిస్తుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే Joint PAins,వాపులు,మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడి మూత్రపిండాల పనితీరు మీద ప్రబావం పడుతుంది.
రోజు కనీసం రెండు లీటర్ల నీటిని తాగాలి. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నప్పుడు అసలు అశ్రద్ద చేయకుండా డాక్టర్ సూచనలను పాటించాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow TeluguLifeStyle On Google News