Mushroom Biryani :మష్రూమ్ బిర్యానీ.. వెజిటేరియన్స్ కోసం చేసే స్పెషల్స్ లో వెజ్ బిర్యానీ ఒకటి. మష్రూమ్స్ తో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
మష్రూమ్స్ – 150 గ్రాములు
బాస్మతి రైస్ – 2 కప్పులు
ఉల్లిపాయలు – 1
క్యాప్సికం – ½ కప్పు
క్యారేట్ – ½ కప్పు
పచ్చిమిర్చి – 2
గ్రీన్ పీస్ – ½ కప్పు
టమోటలు – 2
కారం – 1 ½ స్పూన్
ఉప్పు – 11/2 స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్
ధనియాల పొడి – 1 స్పూన్
బిర్యానీ ఆకు – 2
దాల్చిన చెక్క - 3 ఇంచ్ లు
షాజీరా – ½ టీ స్పూన్
లవంగాలు – 3-4
తయారీ విధానం
1.ముందుగా బాస్మతి రైస్ అరగంట పాటు నానబెట్టుకోవాలి.
2.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నెయ్యి కరిగించి అందులోకి మసాల దినుసులు వేసి వేపుకోవాలి.
3.అందులోకి ఉల్లిపాయలు ,పచ్చిమిర్చి వేసి దోరగా వేపుకోవాలి.
4.ఉల్లిపాయలు వేగాక అందులోకి క్యారేట్స్,పచ్చి బఠానీలు,మష్రూమ్స్ ,క్యాప్సికం వేసుకోని ఒక నిమిషం పాటు వేపుకోవాలి.
5.కూరగాయలు వేగాక అందులోకి టమాటోలు సాఫ్ట్ గా ఉడికించుకోవాలి.
6.అందులోకి పసుపు,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోని మూత పెట్టుకోని రెండు నిమిషాల పాటు వేపుకోవాలి.
7.అల్లంవెల్లుల్లి పేస్ట్ వేగాక కారం,ధనియాల పొడి వేసి బాగా కలుపుకోని అందులోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి రెండు కప్పు ల రైస్ కి నాలుగు కప్పుల నీళ్లను పోసి ,కొత్తిమీర,పుదీనా ఆకులను కలుపుకోవాలి.
8.స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకోని ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడికించాలి.
9.మద్యలో కలుపుకోని మూత పెట్టి పూర్తిగా ఉడికించుకోవాలి.
10.మరో ఐదు నిమిషాలు ఉడికించుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.