Raw Banana Chips:అరటి కాయ చిప్స్.. తక్కువ నూనెతో ఎక్కువ టేస్టీగా చేసుకునే చిప్స్ అంటే అవి బనానా చిప్స్. ఈజీ,హెల్తీ అండ్ టేస్టీ అరటికాయ బనానా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
అరటి కాయలు – 2
కారం – ½ స్పూన్
ఉప్పు – ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ స్పూన్
తయారీ విధానం
1.ముందుగా అరటి కాయలను చివర్లు కట్ చేసుకోని పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.ఇప్పుడు అందులోకి ఉప్పు ,మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
3. స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడిక్కాక అరటి కాయల చిప్స్ ని వేసుకోవాలి.
4.రెండు వైపులా తిప్పుతు కరకరలాడే విధంగా వేపుకుంటే అరటి కాయ చిప్స్ రెడీ.