Mysore Bajji:మైసూర్ బజ్జీ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. అయితే ఇంటిలో చేసుకున్నప్పుడు హోటల్ మాదిరిగా రావాలంటే ఇలా చేస్తే సరిపోతుంది.
కావలసిన పదార్దాలు
మైదా - ముప్పావు కేజీ
నూనె - అరకిలో
పుల్ల మజ్జిగ - 3 కప్పులు
అల్లంముక్క - చిన్నది
పచ్చిమిర్చి - 10
సోడా - కొద్దిగా
ఉప్పు - తగినంత
తయారుచేసే విధానం
ముందుగా పచ్చిమిరపకాయలను, అల్లంను సన్నగా కోసుకోవాలి.ఇప్పుడు మైదా పిండిలో ఉప్పు, సోడా, అల్లం ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు, పుల్ల మజ్జిగ వేసి బాగా కలపాలి. దీనిని మరీ గట్టిగాను మరీ పల్చగానూ కాకుండా మధ్యస్తంగా కలపాలి.
పొయ్యిమీద బాండి పెట్టి నూనె పోసి బాగా కాగాక పిండిని చిన్న సైజు ఉండలుగా చేసి నూనెలో వేస్తె చక్కగా వేగి గుల్ల అయి నూనెలో తేలుతాయి. అప్పుడు వీటిని తీసి సర్వ్ చేయటమే. వీటికి అల్లం పచ్చడి మంచి కాంబినేషన్.