Healthy Food For Kids:ఎదిగే పిల్లలకు పోషకాహారం అత్యవసరం అన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే రోజు మొత్తంలో ఎప్పుడెప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలి అన్న సంగతి తెలియకపోవచ్చు. బ్రేక్ ఫాస్ట్ కింద ఇచ్చిన వాటిల్లో కొన్ని లేదా ఒకటి అయిన పిల్లలకు ఇవ్వచ్చు.
బ్రేక్ ఫాస్ట్
గోదుమలతో తయారుచేసిన బ్రెడ్,జామ్,పాలు
గ్లాస్ పాలు,ఉడకబెట్టిన గుడ్డు
పాలు,చీజ్ శాండ్విచ్
ఉప్మా,ఇడ్లి,ఒక గ్లాస్ పాలు
షార్ట్ బ్రేక్ సమయంలో
ఫ్రూట్ సలాడ్ లేదా పళ్ళ ముక్కలు
మధ్యాహ్నం లంచ్
పరోటాలు లేదా చపాతీతో కూర లేదా పప్పు
అన్నం,పప్పు,కూర,గడ్డ పెరుగు
సాయంత్రం సమయంలో
అరటిపండు షేక్
ఇంటిలో తయారుచేసిన ఒక కప్పు పాప్ కార్న్
బాదం,జీడిపప్పు వంటి నట్స్
రాత్రి డిన్నర్ సమయంలో
మధ్యాహ్నం ఇచ్చిన మెనూ నే కొంచె మర్చి ఇవ్వచ్చు.
కొన్ని జాగ్రత్తలు
* పిల్లలు జంక్ ఫుడ్ విషయంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇంటి ఆహారం కన్నా బయటి ఆహారానికి ప్రాముఖ్యత ఇస్తారు. జంక్ ఫుడ్ ను ఎక్కువగా పిల్లలు తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* ఎదిగే పిల్లలకు కాల్షియం,మినరల్స్,విటమిన్స్,ఇనుము అత్యవసరం. వారు తీసుకొనే ఆహారంలో పై వన్ని సమృద్దిగా ఉండేలా చూసుకోవాలి.
* పాలు,పళ్ళు,ఆకుకూరలు ప్రతి రోజు వారి ఆహారంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
* సాదారణంగా పిల్లలు ఆటలో పది నీటిని త్రాగటం మానివేస్తూ ఉంటారు. పిల్లలు సరిపడా నీటిని త్రాగించే భాద్యత పెద్దలదే.
* పిల్లలు రోజు మొత్తం మీద 5 సార్లు ఆహారం తీసుకొనే విధంగా చూడాలి.