చర్మం కాంతివంతంగా మెరవాలంటే ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి, అరస్పూన్ నిమ్మరసం, సరిపడా నీటిని పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే సరిపోతుంది.
మొటిమల నివారణకు ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి, పావు స్పూన్ పసుపు వేసి సరిపడా నీటిని పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి 5 నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
జిడ్డు చర్మం ఉన్నవారు ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి వేసి సరిపడా రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే మంచి పలితం వస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.