కళ్ళు అనేవి మన చుట్టూ ఉన్న ప్రకృతిని చూడడానికి దేవుడు ప్రసాదించిన వరం.అంతేకాక కళ్ళు మనకు ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాయి. అనేక ఆరోగ్యసమస్యలకు ముందస్తు హెచ్చరికలను కళ్ళు ఇస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కళ్ళను పరీక్ష చేసిది కేవలం దృష్టి గురించి మాత్రమే కాకుండా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నయా లేదా అనే విషయం కోసం కూడా కళ్ళను పరీక్ష చేస్తారు.
కార్డియోవాస్క్యులర్ సమస్యల కోసం
నేత్ర వైద్యులు ఆరోగ్య సమస్యల పరీక్ష సమయంలో ప్రారంభ సంకేతాలను కళ్ళ ద్వారానే తెలుసుకుంటారు. ఎందుకంటే కళ్ళ ద్వారా అయితే రక్త నాళాలను పరిశీలన చేయటం సులభం.అధిక రక్తపోటు మరియు మధుమేహం గురించి హెచ్చరిక సంకేతాలను కంటి ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాక స్ట్రోక్ మరియు ఇతర గుండె వ్యాధులకు దారి తీసే పరిస్థితులను కూడా తెలుసుకోవచ్చు.
సాదారణ ఆరోగ్యం కోసం కళ్ళు మనకు ఎన్నో సూచనలను ఇస్తాయి. కళ్ళు ఒక వ్యక్తి యొక్క మెదడు ఆరోగ్య మార్పులకు కూడా సుచనలను ఇస్తాయి. అంతేకాక దృష్టి నాడి, మెదడు కణితులు లేదా మల్టిపుల్ స్క్లేరోసిస్ వంటి వాటికీ కూడా సూచనలు ఇస్తాయి. అలాగే కంటి రక్తనాళాల్లో జరిగే మార్పులు అథెరోస్క్లెరోటిక్ వ్యాధిని హెచ్చరిస్తాయి.
ఆరోగ్య డిటెక్టర్స్
మీ కళ్ళు మీ ఆరోగ్య పరిస్థితిని స్పష్టంగా,అద్భుతంగా చెప్పుతాయి. మీ కంటి పరిస్థితిని గమనించటం లేదా హెచ్చరిక సంకేతాల ద్వారా మీరు సులభంగా మీ ఆరోగ్య పరిస్థితి ని ఒక అంచనా వేసుకోవచ్చు.
కళ్ళు ఉబ్బి ఉంటే
ఇది థైరాయిడ్ సమస్యలకు సంకేతం కావచ్చు. థైరాయిడ్ హార్మోన్ల అసమానతలు కంటి చుట్టూ ఉండే కణజాలం వాపునకు కారణం అవుతాయి. తద్వారా కళ్ళు ఉబ్బినట్టు కన్పిస్తాయి.
వాలిన కనురెప్పలు
కండరాల బలహీనతతో బాధపడుతున్నప్పుడు కను రెప్పలు వాలిపోతాయి. ఈ విధంగా కనురెప్పలు వాలిపోవటం అనేది మెడ కణితులు మరియు హార్నర్స్ సిండ్రోమ్ కు సంకేతంగా చెప్పవచ్చు.
కంటి కార్నియా చుట్టూ వలయాలు
విల్సన్స్ వ్యాధి వంశ పారంపర్యంగా వస్తుంది. ఈ వ్యాధిని కంటి కార్నియా చుట్టూ వలయాల ద్వారా గుర్తించవచ్చు. ఈ వ్యాధికి చికిత్స చేయకపోతే ప్రాణాంతకం అవుతుంది.
మందపాటి కనురెప్పలు
ఇది కూడా వంశ పారంపర్యంగా వచ్చే వ్యాధి. కంటి పరీక్షలో న్యూరోఫిబ్రోమాటోసిస్ ను గుర్తించవచ్చు. ఈ రుగ్మత కణితులు మరియు నరాల ఫైబర్లు అభివృద్ధి చెందటానికి కారణమవుతుంది.
పసుపు రంగు కళ్లు
పసుపు రంగు కళ్లు అనేవి అనేక రకాల కాలేయ పరిస్థితులను సూచిస్తాయి.
రెటీనాలో లోపాలు
రెటీనాలో లోపాలు ఒక రోగి యొక్క ఎయిడ్స్ ఉనికిని గమనించటానికి సహాయపడతాయి.
కంటి శుక్లాలు
ఇవి కేవలం కంటి శుక్లాలు మాత్రమే కాదు. మధుమేహం మరియు కణితులకు ఒక సూచనగా భావించవచ్చు.
కనురెప్ప పుళ్ళు
ఇవి చర్మ క్యాన్సర్ కి సంకేతంగా చెప్పవచ్చు.
ఫ్లాషింగ్ లైట్లు
ఇది మైగ్రేన్ తలనొప్పికి సూచన అని చెప్పవచ్చు.
సూర్యోదయ సిండ్రోమ్
ఇది స్ఫటికాకార కటకాలను నియంత్రించడంలో కణజాలంపై ప్రభావితం చేస్తుంది. అంతేకాక మార్ఫాన్స్ సిండ్రోమ్ యొక్క ఉనికికి సూచనగా చెప్పవచ్చు.
మేటాస్టాటిక్ క్యాన్సర్
పురుషులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉనికి మరియు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ని గమనించటానికి సహాయపడుతుంది.
డబుల్ విజన్
ఇది నరాల దెబ్బతిన్నాయనే సంకేతాన్ని ఇస్తుంది.
పాలిపోయిన కనురెప్పలు
మీరు రక్తహీనత మరియు ఇనుము లోపంతో బాధ పడుతున్నారని అర్ధం.
పైన చెప్పిన సూచనలు అన్ని ఒక శక్తివంతమైన విశ్లేషణ పరికరం వలే పనిచేస్తాయి. మీ శరీరంలో ఏ బాగానికి పరీక్షలు అవసరమో ఖచ్చితంగా చెప్పుతాయి. ఈ హెచ్చరికలు ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే ఈ హెచ్చరికల ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం ఉందో లేదో సులభంగా తెలిసికోవచ్చు.
ఈ పాయింట్స్ అన్ని సమగ్ర కంటి పరీక్షలను చేయించుకోవటానికి అవసరమైనవి. ఈ విధానం కేవలం కంటి అలసట లేదా కొత్త అద్దాల ప్రిస్క్రిప్షన్ తనిఖీ కొరకు మాత్రం కాదు. ఈ కంటి పరీక్షలు సాదారణ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఈ వైద్య ప్రక్రియలను ఒక షెడ్యూల్ ప్రకారం చేయించుకుంటే మంచిది.
కంటి పరీక్షలకు సమయం
అమెరికన్ కంటి వైద్య అకాడమీ కంటి పరీక్షల సమయాన్ని గురించి కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. 40 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి 5 నుండి 10 సంవత్సరాలకు పూర్తి కంటి పరీక్షలు చేయించుకోవాలి.
సహజంగానే, ఈ పరీక్షల సమయం వయస్సు పెరిగే కొద్ది మారుతుంది. కింద ఉన్న సమయ పట్టికనును ఫాలో అవటం మంచి ఆలోచన.
40 నుండి 54 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు రెండు సంవత్సరాలకు పరీక్షలు చేయించుకోవాలి. అయితే పరీక్షల మధ్య గరిష్ట విరామం నాలుగు సంవత్సరాలు ఉండాలి.
55 నుండి 64 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు చేయించుకోవాలి. అయితే పరీక్షల మధ్య గరిష్ట విరామం మూడు సంవత్సరాలు ఉండాలి.
65 సంవత్సరాలు వయస్సు కంటే ఎక్కువ ఉన్నవారు ప్రతి సంవత్సరం చేయించుకోవాలి. అయితే పరీక్షల మధ్య గరిష్ట విరామం రెండు సంవత్సరాలు ఉండాలి.
మొత్తం కంటి పరీక్షలను చేయించుకుంటే దృష్టి సమస్యలను పరిశీలన చేయవచ్చు. గ్లాకోమా మరియు కంటి శుక్లాలను ప్రారంభ దశలో కనుగొంటే సులభంగా చికిత్స చేయవచ్చు. సాదారణంగా ఎవరైనా డాక్టర్ దగ్గరకు వెళ్ళాలంటే ఏ దుర్వార్త వినవలసి వస్తుందో అని భయపడతారు. కానీ మీ కంటి పరీక్షల ద్వారా ఏమైనా సమస్య ఉంటే బయట పడుతుందని గుర్తుంచుకోవాలి.
ఏదైనా తీవ్రమైన సమస్య ఉంటే కనుగొనవచ్చు. ఏదైనా సమస్య ప్రారంభ దశలో ఉంటే చికిత్స చేయటం వైద్యులకు తేలిక అవుతుంది. అంతేకాక నిజం చెప్పాలంటే మనకు ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. మీరు కంటి పరీక్షలను చేయించుకుంటే చాలా డబ్బును అదా చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఎవైన సమస్యలు ఉంటే ముందుగానే గుర్తించవచ్చు.
కంటి జాగ్రత్త మరియు మంచి ఆరోగ్యం
మీరు కళ్ళను జాగ్రత్తగా చూసుకుంటే, అది మీ మొత్తం ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఉదాహరణకి, మీరు ఎండలోకి వెళ్ళకుండా ఉంటే, అల్ట్రా వైలెట్ కిరణాల నుంచి కళ్ళకు రక్షణ కలిగి మీ శరీరానికి చర్మ క్యాన్సర్రా కుండా కాపాడుతుంది. కంటి ఆరోగ్యానికి సహాయపడే యాంటి ఆక్సిడెంట్స్స మృద్దిగా ఉన్న ఆహారాలను తీసుకుంటే, శరీరంలో మిగతా బాగాలకు కూడా రక్షణ కలుగుతుంది.
మంచి కంటి ఆరోగ్యానికి మరియు శరీర ఆరోగ్యానికి అనేక అనుసంధానాలు ఉన్నాయి. అందుకే డాక్టర్స్ విటమిన్లు మరియు ఖనిజాలు తీసుకోవాలని సూచిస్తారు. కళ్ళ కోసం తీసుకొనే మల్టీ విటమిన్లు కూడా చర్మం మరియు హృదయనాళ వ్యవస్థకు సహాయం చేస్తాయి. మీ ఆరోగ్యం బాగుంటే మీ కళ్ళ దృష్టి కూడా బాగుంటుందని గుర్తుంచుకోండి.
దృష్టి పరీక్షను రెగ్యులర్ గా చేయించుకోవాలి
బిజీ జీవితంలో చాలా మంది వారి ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టటం మానేస్తున్నారు. అలాగే వారికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా తీసుకోవటానికి సమయం ఉండటం లేదు. అంతేకాక వారు శారీరక పరీక్షల షెడ్యూల్ ని కూడా మర్చిపోతున్నారు.
కానీ, ఒక చిన్న కంటి పరీక్ష మీ మొత్తం శారీరక పరిస్థితిని మానిటర్చే యటానికి సహాయ పడుతుంది. మీ మొత్తం ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పటానికి ఒక కళ్ళు సరిపోతాయి. నిజం చెప్పాలంటే మీకు ఉన్న బిజీ షెడ్యుల్ లో ఒక కంటి పరీక్ష చేయించుకోవటం పెద్ద కష్టమేమి కాదు. అంతేకాక ఈ పరీక్షలకు ఖర్చు కూడా ఎక్కువేమి కాదు. కాబట్టి మీరు దృష్టి పెడితే ఈ పరీక్షలు చేయించుకోవటం చాలా సులభం.