Crispy Bendakaya Fry:బెండకాయ వేపుడు జిగురులేకుండా తక్కువ నూనెతో అన్నంలోకి కలుపుకొనేలా చేయాలంటే...

Crispy Bendakaya Fry: పెద్దవారైనా ,చిన్నపిల్లలైనా బెండకాయ కూరంటే ఇష్టపడని వారుండరు.
పప్పు,సాంబార్,రసంలోకి సైడ్ డిష్ పొడిపొడిగా బెండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్ధాలు
బెండకాయలు – ¼ kg
రవ్వ – 2 టేబుల్ స్పూన్స్
కారం – తగినంత
ఉప్పు – రుచికి సరిపడా
నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా లేత బెండకాయలను శుభ్రంగా కడిగి తడిలేకుండా ఆరబెట్టుకోవాలి.

2.ఆరిన బెండకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

3.బెండకాయ ముక్కల్లోకి పసుపు,కారం,ఉప్పు,నిమ్మరసం వేసి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

4.ఇప్పుడు వేరొక బౌల్ లోకి రెండు టేబుల్ స్పూన్స్ బాంబే రవ్వ ,ఉప్పు,ధనియాల పొడి,జీలకర్ర వేసి అందులోకి బెండకాయ మిశ్రమాన్ని వేసి బాగా టాస్ చేసుకోవాలి.

5.కలుపుకున్న ఈ మిశ్రమాన్ని పదిహేను నుంచి ఇరువై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

6.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి వేడెక్కినా ఆయిల్ లోకి మారినేట్ చేసుకున్న బెండకాయలను వేసి బాగా కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ పై ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి.

7.ఐదు నిమిషాల తర్వాత మూత తీసి బెండకాయలు కరకరలాడే వరకు లోఫ్లేమ్ పై వేపుకోవాలి.

8.అంతే బెండకాయ వేపుడు రెడీ అయినట్టే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top