Garlic cheese bread:ఇంట్లో స్నాక్స్ ఏమి లేకపోయినా బ్రెడ్ ఉంటే చాలు. ఎంతో రుచికరమైన చీజ్ బైట్స్ తయారు చేసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలకి చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తినేస్తారు.
కావాల్సిన పదార్ధాలు
బ్రెడ్ స్లైసెస్ – 4
చీజ్ – 250 గ్రాములు
కార్న్ ఫ్లోర్ – 2-3 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం
1.ముందుగా బ్రెడ్ స్లైస్ ని తీసుకోని దాని పై చీజ్ ను స్ప్రెడ్ చేసుకోవాలి.
2.ఆ బ్రెడ్ పై మరో బ్రెడ్ పీస్ పెట్టుకోని వాటిని బైట్స్ గా కట్ చేసుకోవాలి.
3.ఇప్పుడు వేరొక బౌల్ లో ఆఫ్ కప్ నీళ్లను తీసుకోని అందులోకి కార్న్ ఫ్లోర్ వేసి మిక్స్ చేసుకోవాలి.
4.కార్న్ ఫ్లోర్ ని కాస్తా జారుగా కలుపుకోవాలి.
5.అందులోకి బ్రెడ్ బైట్స్ ని వేసి డిప్ చేసి తీసుకోవాలి.
6.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి ప్యాన్ పై డిప్ చేసుకున్న బ్రెడ్ బైట్స్ ని ప్లేస్ చేసుకోని ఫ్రై చేసుకోవాలి.
7.మీడియం ఫ్లేమ్ పై బ్రెడ్ ముక్కలను క్రిస్పిగా ఫ్రై చేసుకోవాలి.
8.బ్రెడ్ ముక్కలు బ్రౌన్ కలర్ లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోని సర్వ చేసుకోవడమే.