Bellam Gavvalu Recipe:బెల్లం గవ్వలు కరకరలాడాలంటే పిండిని ఇలా కలిపి చూడండి

Bellam gavvalu
Bellam Gavvalu Recipe: పిల్లల కోసం ఈవినింగ్ ,స్కూల్ బాక్స్ లోకి స్నాక్స్ కంపల్సరీ. ఈజీగా,క్విక్ గా తయారు చేసుకునే,అలాగే పిల్లలు ఇష్టంగా తినే బెల్లం గవ్వలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
మైదా – 2 కప్పులు
బొంబాయి రవ్వ – 1 కప్పు
ఉప్పు – 1 ½ టీ స్పూన్
యాలకులు పొడి – 1 టీ స్పూన్

తయారీ విధానం
1.ఒక మిక్సింగ్ బౌల్ లోకి రెండు కప్పుల మైదా,కప్పు బొంబాయి రవ్వ ఉప్పు ,చిటికెడు బేకింగ్ సోడా ,మూడు టేబుల్ స్పూన్స్ వేడి నూనె వేసి తగినన్ని నీళ్లు యాడ్ చేసుకోని పిండిని బాగా కలుపుకోవాలి.

2.కలుపుకున్న పిండిని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.

3.అరగంట తర్వాత పిండిని బాగా కలుపుకోని కొద్ది కొద్దిగా పిండిని తీసుకోని గవ్వలు చేసే పరికరం సాయంతో వత్తుకోవాలి.

4.తయారు చేసుకున్న గవ్వలను పక్కన ప్లేట్ లోపెట్టుకోవాలి.

5.ఆయిల్ వేడి చేసి డీప్ ఫ్రై చేసుకోని పక్కన పెట్టుకోవాలి.

6. ఇప్పుడు బెల్లం సిరప్ కోసం ½ కప్పు బెల్లం ,1/4 కప్పు నీళ్లను యాడ్ చేసి స్టవ్ పై పెట్టుకోని కలుపుతు కరిగించుకోవాలి.

7. బెల్లం ఉడుకుతున్న సమయంలో అందులోకి యాలకుల పొడి,కరిగించిన నెయ్యి వేసి తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి.

8.బెల్లం పాకం రెడీ అయినతర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోని వేయించి పెట్టుకున్న గవ్వలను బెల్లం పాకంలో వేసి సర్వ్ చేసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top