Vitamin D:మన శరీరం కాల్షియం గ్రహించటానికి,ఎముకలు దృడంగా ఉండటానికి విటమిన్ డి చాలాఅవసరం. అంతేకాక ఇది మధుమేహం వంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. అందువలన మన శరీరానికి విటమిన్ డి తగు మోతాదులో అందే విధంగా చూసుకోవాలి.
చర్మానికి ఎండ తగిలినప్పుడు మన శరీరం విటమిన్ డి ని సహజంగానే తయారుచేసుకుంటుంది. అందువల్ల ప్రతి రోజు కనీసం 15 నిముషాలు చర్మానికి ఎండ తగిలే విధంగా ఆరు బయట నిల్చోవాలి.
వీలైతే విటమిన్ డి కలిపిన పాలు, పండ్ల రసాలు,అల్పాహారాలు,చీజ్ వంటివి తీసుకోవాలి.
విటమిన్ డి సమృద్దిగా లభించే చేపలు,పుట్ట గొడుగులు,గుడ్డులోని పచ్చ సోన తగినంతగా తీసుకోవాలి.
విటమిన్ డి లోపం మరీ ఎక్కువగా ఉంటే మాత్రం అశ్రద్ద చేయకుండా తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి.

