విటమిన్ల గని 'చెన్నంగి ఆకు పచ్చడి'.. ఆరోగ్యానికి ఎంతో మేలు!

Chennangi Aaku Pachadi:విటమిన్ల గని 'చెన్నంగి ఆకు పచ్చడి'.. ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఆరోగ్యానికి ఆకు కూరలు మేలు చేస్తాయి. పాలకూర,తోటకూర,బచ్చలి కూర తరుచుగా వాడుతుంటాం. చెన్నంగి ఆకు కూరతో పచ్చడి ట్రైచేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
చెన్నంగి ఆకులు – 2 కట్టలు
ఎండుమిర్చి – 10-12
ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్
మెంతులు – ½ టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
నువ్వలు – 2 టేబుల్ స్పూన్స్
వెల్లుల్లి రెబ్బలు – 7-8
చింతపండు – 10 గ్రాములు
మినపప్పు – 1 టీ స్పూన్
శనగపప్పు – 1 టీ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
కరివేపాకు – ½ కప్పు
పసుపు – ¼ పసుపు
నూనె – 3 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం
1.ముందుగా చెన్నంగి ఆకును శుభ్రం చేసుకోని తరిగి పక్కన పెట్టుకోవాలి.

2.బాండీలో ఆయిల్ వేడి చేసి అందులోకి ధనియాలు ,మెంతులు,జీలకర్ర,ఎండుమిర్చి,నువ్వులు ,వెల్లుల్లి రెబ్బలు వేసి వేపుకోని వేరొక ప్లేట్ లోకి తీసుకోండి.

3.ఇప్పుడు అదే బాండీలో మరో స్పూన్ ఆయిల్ వేసి చెన్నంగి ఆకును వేసి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి.

4.ఇప్పుడు మిక్సిజార్ లో వేపుకున్న దినులసులు,చెన్నంగి ఆకులను వేసి,1/2 టీ స్పూన్ ఉప్పు,నానబెట్టిన చింతపండును వేసి కొద్దిగా నీళ్లు కలుపుకోని గ్రైండ్ చేసుకోవాలి.

5.ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులోకి ఆయిల్ వేసి ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి ,కరివేపాకు,వేసి తాలింపు వేగా గ్రైండ్ చేసుకున్న చెన్నంగి పచ్చడిని పోపులో వేసి కలుపుకోవాలి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top