Hands Whitening: క్షణాల్లో నల్లగా ఉన్న మీ చేతులు తెల్లగా మారిపోతాయి

Hands Whitening Home Remedies: ఒక స్పూన్ ఎండిన చామంతి పూల పొడిలో ఒక స్పూన్ కోకో బటర్, రెండు స్పూన్ల వెన్న,రెండు స్పూన్ల అప్రికాట్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒకపాన్ లో వేసి పొయ్యి మీద పెట్టి ఉడికించి చల్లారిన తర్వాత ఒక జార్ లో వేసి భద్రపరచాలి.

రాత్రి పడుకొనే ముందు చేతులను శుభ్రపరచుకొని ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. ఎండ వల్ల నల్లగా మారిన చేతులు చాయ రావటమే కాకా మృదువుగా మారతాయి.

ఒక స్పూన్ బంగాళదుంప తురుములో ఒక స్పూన్ తేనే వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నలుపు ఉన్న ప్రదేశంలో రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. మంచి పలితాన్ని పొందాలంటే దాదాపు నెల రోజుల పాటు చేయాలి.

ఒక స్పూన్ దోస రసం,ఒక స్పూన్ నిమ్మరసం,చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు రాసుకొని 20 నిముషాలు అయ్యిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి పలితం కలుగుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top