క్రిస్పీ అరికె దోశ: ఇలా చేస్తే ఒక్కటి కూడా మిగల్చకుండా తింటారు!

Kodo Millet Dosa:క్రిస్పీ అరికె దోశ: ఇలా చేస్తే ఒక్కటి కూడా మిగల్చకుండా తింటారు..  మార్నింగ్ హెల్తీ దోశ కావాలనుకునేవారు ఇడ్లీ,దోశ ,పెసరట్టు ప్రిఫర్ చేస్తుంటారు.

రెగ్యులర్ గా మినపప్పు విత్ రైస్ తో కాకుండా .రైస్ ప్లేస్ లో అరికెలు జోడించి దోశలు వేసుకుంటే ఆరోగ్యానికి, రుచికి సూపర్ గా ఉంటాయి.

కావాల్సిన పదార్ధాలు
మినపప్పు – 1 కప్పు
అరికెలు -2 కప్పులు
మెంతులు – ½ టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా మినపప్పును శుభ్రంగా కడిగి నీళ్లు,మెంతులు వేసి ఆరు నుంచి ఏడు గంటలు నానబెట్టుకోవాలి.

2.అరికెలను కూడ ఆరు నుంచి ఏడు గంటలు నానబెట్టుకోవాలి.
3.నానబెట్టుకున్న పప్పులను మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

4.గ్రైండ్ చేసుకున్న పిండిని వేరోక గిన్నెలోకి ట్రాన్సఫర్ చేసుకోవాలి.

5.అందులోకి ఉప్పు తగినన్ని నీళ్లు వేసి దోశ బ్యాటర్ ని సిధ్దం చేసుకోవాలి.

6.దోశ పెనం వేడి చేసి రెండు గరిటల బ్యాటర్ ని వేసి స్ప్రెడ్ చేసుకోని దోరగా వేయించు కుంటే ఆరోగ్యకరమైన అరికల దోశ రెడీ.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top