Oats dates Lassi:ఓట్స్ డేట్స్ లస్సీ.. సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ లోకి హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్స్ కోసం చూస్తున్నారా . అయితే ఓట్స్ ,డేట్స్ తో కలిపి లస్సీ చేసి చూడండి.
కావాల్సిన పదార్ధాలు
పెరుగు – 1 కప్పు
పాలు – 1 కప్పు
ఓట్స్ – 1 కప్పు
ఖర్జూరం – 1 కప్పు
ఐస్ క్యూబ్స్ – తగినన్ని
తయారీ విధానం
1.ముందుగా ఖర్జూరం లో గింజలను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.తర్వాత పాలు,ఓట్స్ ని ఐస్ క్యూబ్స్ వేసి పది నిమిషాలు నానపెట్టుకోవాలి.
3.నానబెట్టుకున్న పాలు,ఓట్స్ ని పెరుగు,ఖర్జూరాలు ,యాలకులు యాడ్ చేసి బ్లెండర్ లో బ్లెండ్ చేసుకోవాలి.
4.అవసరం అనుకుంటే చక్కెరను యాడ్ చేసుకోవచ్చు.
5.బ్లెండ్ చేసుకున్న లస్సీని సర్వింగ్ గ్లాస్ లోకి పోసి నచ్చిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.