Dondakaya Fry with Ulli Karam :దొండకాయ ఉల్లికారం.. మాములుగా వండితే దొండకాయ కూర ఎవ్వరు ఇష్టపడరు. ఫ్రై కాని మసాలా తో గాని స్పెషల్ గా ప్రిపేర్ చేస్తే రుచి మరింత తోడౌతుంది. దొండకాయతో ఉల్లికారం తగిలించి చూడండి.
కావాల్సిన పదార్ధాలు
దొండకాయలు – ¼ kg
ఎండుమిర్చి – 7-8
ఉల్లిపాయలు – 2
జీలకర్ర – 1 టీ స్పూన్
ధనియాలు – 2 టీ స్పూన్స్
వెల్లుల్లి పేస్ట్ – 5-6
ఉప్పు – 1 టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
తయారీ విధానం
1.దొండకాయలు నిలువ చీల్చి నాలుగు ముక్కలుగా చీల్చి వదిలేయండి.
2.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి జీలకర్ర,ఎండుమిర్చి,ధనియాలు,ఉల్లిపాయలు వేసి నాలుగు ఐదు నిమిషాలు వేపుకోవాలి.
3.ఉల్లిపాయలు వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి.
4.ఇప్పుడు దొండకాయలను వేపుకోవడానికి బాండీలో ఆయిల్ వేడి చేసి దొండకాయలు వేసి పది ,పదిహేను నిమిషాలు వేపుకోవాలి.
5.ముందుగా వేపుకున్న మసాలాలను మిక్సి జార్ లో వేసి వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి.
6.ఇప్పుడు వేగిన దొండకాయ ముక్కల్లో పసుపు ,రుచికి సరిపడా ఉప్పు ,గ్రైండ్ చేసుకున్న ఉల్లి కారం పేస్ట్ వేసి దొండకాయ ముక్కలకు పట్టుకునేలా మిక్స్ చేసుకోవాలి.
7.మసాలాలు పట్టుకోవడానికి పదినిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
8.అంతే వేడి వేడి దొండకాయ ఉల్లి కారం రెడీ.