Face Glow Tips;ముఖ చ‌ర్మం స్మూత్‌గా మారాలా.. అయితే ఇవి ట్రై చేయండి

Egg Face Pack: చర్మానికి మేలు చేసే గుణాలు ప్రకృతి సిద్దంగా లభించే పదార్దాల్లో పుష్కలంగా
ఉంటాయి. గుడ్డులోని తెల్లసొన,పాలు,బాదం పప్పు,నిమ్మరసం,తేనే,క్యారట్ వంటి వాటితో చర్మ కాంతిని మెరుగు పరుచుకోవచ్చు.

ఎగ్ ప్యాక్ : ఒక బౌల్ లో ఒక స్పూన్ గుడ్డు తెల్లసొన, అరస్పూన్ పాల మీగడ,అరస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేసుకుంటే మంచి పలితం కనపడుతుంది.

పాలు : ముందు రోజు రాత్రి ఐదు బాదం పప్పులను నానబెట్టి మరుసటి ఉదయం పట్టు తీసి మెత్తని పేస్ట్ చేసి పాలను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పదిహేను నిముషాలు అయ్యిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. పాలలో ఉండే గుణాలు మురికిని పోగొడతాయి. బాదంలో ఉండే సహజ నూనెలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

తేనే : ఒక స్పూన్ తేనెలో అరచెక్క నిమ్మరసం పిండి బాగా కలిపి ముఖానికి రాసి 15 నిముషాలు అయిన తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం మీద ఉన్న మలినాలను తొలగించి మంచి క్లెన్సర్ గా పనిచేస్తుంది.

క్యారట్ : క్యారట్,బంగాళదుంప లను ఉడికించి మెత్తగా చేయాలి. దీనిలో చిటికెడు బేకింగ్ సోడా,చిటెకెడు పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఐదు నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top