Heart Attack : గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలు పైపుల మాదిరిగా ఉంటాయి. ఈ పైపుల వంటి రక్త నాళాల నుంచి గుండెకు రక్తం అందే క్రమంలో ఆ రక్త నాళాల గోడలకు కొవ్వు పడుతూ
ఉంటుంది.
అలా కొవ్వు పట్టిన కొద్ది రక్త నాళాలు సన్నపడతాయి. ఇలా సన్నపడటం వలన గుండెకు అందాల్సిన రక్తం తగ్గిపోతుంది. రక్త నాళాలు సన్నపడి కొన్ని అడ్డంకులు ఏర్పడవచ్చు.
ఈ అడ్డంకుల కారణంగా గుండెకు అవసరమైన రక్తం సరఫరా జరగదు.
దాంతో గుండె కండరాలకు తగినంత పోషకాలు,ఆక్సిజన్ అందవు. ఏ కండరానికి అయిన తగినంత ఆక్సిజన్,పోషకాలు అందకపోతే చచ్చుపడిపోతాయి. అదే గుండె కండరాలకు కూడా వర్తిస్తుంది.
రక్తం సరిగ్గా అందకపోవటం వలన గుండె కండరం చచ్చుపడిపోతుంది. దీన్నే మనం ‘గుండె పోటు’ లేదా ‘హార్ట్ ఎటాక్’ అని అంటాం. అయితే గుండెపోటు లక్షణాలు అందరిలోనూ ఒకేలా కాకుండా ఉండవు.
వాటిలో ముఖ్యమైనది చాతి నొప్పి. ముఖ్యంగా చాతి బరువుగా ఉండటం,ఎడమ చేయి కానీ మెడ
నొప్పి కానీ రావటం,కడుపులో మంటగా ఉండటం,శ్వాసలో ఇబ్బంది,తల తిరిగినట్టు
అన్పించటం,వెక్కిళ్ళు రావటం వంటి లక్షణాలు ఉంటాయి.
ఇటువంటి లక్షణాలు ముఖ్యంగా వయస్సు మళ్ళిన వారు,రక్తపోటు,షుగర్ వ్యాధులు ఉన్నవారిలోను,అధిక బరువు ఉన్నవారిలోను,పొగ త్రాగే అలవాటు ఉన్నవారిలో కనపడతాయి. గుండె రక్త నాళాల్లో ఉన్న అడ్డంకులను యంజియో ప్లాస్టి ద్వారా తొలగిస్తే గుండెపోటు రాకుండా నివారించవచ్చు.

