Pedicure Tips in telugu: సాదారణంగా అందానికి ముఖమే కొలమానం. కాబట్టి అందరూ ముఖ సౌందర్యానికే ఎక్కువ ప్రాదాన్యత ఇస్తారు.
అయితే ఇటీవల కాలంలో పాదాల,చేతుల సంరక్షణ పట్ల అమ్మాయిల్లో ఎక్కువ ఆసక్తి పెరగటంతో బ్యూటి పార్లర్ కి వెళ్లి పెడిక్యుర్,మానిక్యుర్ వంటివి చేయించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం పాదాల సంరక్షణకు కొన్ని పెడిక్యుర్ ప్యాక్ గురించి తెలుసుకుందాం.
నిమ్మరసం : ముందుగా పాదాలను చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత పాదాలకు రాసే క్రీంలో కొంచెం నిమ్మరసం కలిపి పాదాలకు రాసి ఇరవై నిముషాలు అయ్యాక నీటిలో ముంచిన దూదితో శుభ్రం చేయాలి. ఈ విధంగా ప్రతి రోజు రాత్రి పడుకొనే సమయంలో చేస్తే మీ పాదాలు మృదువుగా మారతాయి. మీరు ఫుట్ క్రీంకి బదులుగా వెన్నను ఉపయోగించవచ్చు.
గోధుమ రవ్వ : గోధుమ రవ్వకు కొద్దిగా నిమ్మరసం,పాలను కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకొని ఐదు నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి. చల్లని నీటితో పాదాలను శుభ్రం చేసుకొని మెత్తని టవల్ తో పాదాలను పొడిగా తుడిచి వేరుశనగ నూనెను రాయాలి.
శనగపిండి : కొద్దిగా శనగపిండి తీసుకోని దానిలో కొంచెం తేనే,పెరుగు కలిపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకొని పావుగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. అయితే ఈ ప్యాక్స్ వేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవటం మాత్రం మర్చిపోకూడదు.

