Instant Egg Fried Rice: లంచ్ బాక్స్ లోకి పిల్లలు ఇష్టంగా తినాలంటే ముందుగా ఎవరైనా ఎగ్ రైస్ ప్రిఫర్ చేస్తారు. ఈజీ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్ధాలు
వండిన అన్నం – 2 కప్పులు
ఉల్లిపాయలు – 1
పచ్చిమిర్చి – 3-4
కరివేపాకు – 2 రెమ్మలు
పుదీనా – కొద్దిగా
కొత్తిమీర – చిన్న కట్ట
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
మసాలా పౌడర్ – 1 ½ స్పూన్
తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె వేడి చేసి అందులోకి నెయ్యి లేదా,బటర్ వేసుకోవాలి.
2.అందులోకి బిర్యానీ ఆకు,లవంగాలు,దాల్చిన చెక్క ,యాలకులు వేసివేపుకోవాలి.
3.మసాల వేగాక తరిగిన ఉల్లిపాయలు ,పచ్చిమర్చి,కరివేపాకు,పూదీనా,కొత్తిమీర ,తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి రెండు,మూడు నిమిషాలు ఉడికించుకోవాలి.
4.అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఎగ్స్ వేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి.
5.గుడ్డు వేగాకా అందులోకి కొత్తిమీర తరుగు వేసి కలుపుకోని రెండు కప్పుల అన్నం వేసి కలుపుకుంటే ఎగ్ రైస్ రెడీ.

