Kothimeera Pachadi:కొత్తిమీర పచ్చడి ఇలా చేస్తే.. దేనిలోకైనా సూపర్ గా ఉంటుంది..

Kothimeera Pachadi: ఎన్ని కూరలతో తిన్నా మొదటి ముద్ద రోటి పచ్చడి తో తింటే ఆ మాజానే వేరు. అరుగుదలకు ఎంతగానో తోడ్పడే కొత్తిమీర తో చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
కొత్తిమీర – తగినంత
టమాటో – 2
పచ్చిమిర్చి – 5-6
ధనియాలు – 2 టీ స్పూన్స్
జీలకర్ర – 1 టీ స్పూన్
మెంతులు – ½ టీ స్పూన్
నువ్వులు – 2 టీ స్పూన్స్
వెల్లుల్లి రెబ్బలు – 7-8
చింతపండు – 10 గ్రాములు
జీలకర్ర – ½ టీ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
కరివేపాకు – 2 రెమ్మలు
ఎండుమిర్చి – 2
పసుపు -1/4 టీ స్పూన్

తయారీ విధానం

1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేడి చేసి అందులోకి ధనియాలు ,జీలకర్ర,మెంతులు,నువ్వులు ,వెల్లుల్లి వేసి కాస్తా వేపుకోని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.

2.వేపుకున్న మిశ్రమాన్ని వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి.

3.అదే ప్యాన్ లోకి పచ్చిమిర్చి వేసి వేపుకోని అందులోకి టమాటో ముక్కలు వేసి మెత్తపడే వరకు ఉడకించుకోవాలి.

4.టమాట మగ్గాక కొత్తిమీర యాడ్ చేసుకోవాలి.

5.ఇప్పుడు ముందుగా వేపి పెట్టుకున్న మసాల దినుసులను మిక్సి జార్ లో వేసుకోని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

6.అందులోకి ఉడికిన టమాటో మిశ్రమాన్ని వేసి తగినంత ఉప్పు వేసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

7.ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనే వేడి చేసుకోవాలి.

8.అందులోకి జీలకర్ర,ఆవాలు,ఎండుమిర్చి ముక్కలు,కరివేపాకు ,పసుపు వేసి వేగిన తాలింపు లోకి గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర చట్నీ వేసి కలుపుకుంటే కమ్మటి కొత్తిమీర చట్నీ రెడీ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top