Dates Payasam:ఖర్జూరం పాయసం.. శరీరానికి బలాన్నిచ్చి,తక్షణ శక్తినిచ్చే ఖర్జూరాన్ని మిల్క్ షేక్స్ లో వాడుతుంటాం. ఈ సారి ఖర్జూరం తో డ్రై ఫ్రూట్స్ మిక్సి చేసి పాయసం చేసి చూడండి.
కావాల్సిన పదార్ధాలు
ఖర్జూరాలు – 15
వాల్ నట్స్ – కొద్దిగా
బాదం – కొద్దిగా
పాలు – 3 ½ కప్పులు
చక్కెర – 2 టేబుల్ స్పూన్స్
యాలకుల పొడి – ½ టీ స్పూన్
తయారీ విధానం
1.ముందుగా ఖర్జూరాల్లో గింజలను తొలగించుకోవాలి.
2.అన్ని డ్రై ఫ్రూట్స్ ని ఒక గిన్నెలో వేసుకోని వేడి పాలు మునిగేలా పోసి పది ,పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలి.
3.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని కొన్ని బాదం పిస్తాలను నెయ్యిలో వేపుకోని గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకోవాలి.
4.ఇప్పుడు స్టవ్ పై మూడున్నర కప్పులు పాలు పెట్టుకోని మరిగించుకోవాలి.
5.పొంగు రాగానే లో ఫ్లేమ్ లోకి మార్చుకోని పాలు చిక్కపడే వరకు మరిగించుకోవాలి.
6. నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని పాలో పాటు గా మిక్సి జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
7.మరుగుతున్న పాలలోకి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని కలుపుకోని పది నిమిషాలపాటు పాయసం చిక్క పడే వరకు మరిగించుకోవాలి.
8.అందులోకి చక్కెర ,యాలకుల పొడి వేసి కలుపుకోని స్టవ్ ఆఫ్ చేసుకోని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోని సర్వ్ చేసుకోవడమే.